AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Husband Caught His Wife: ప్రియుడితో కలిసి భార్య రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!

ప్రియుడితో కలిసి ఉండగా తన భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు ఓ భర్త. వారిద్దరినీ ఓ గదిలో బంధించి, పోలీసులకు సమాచారం అందించాడు.

Husband Caught His Wife: ప్రియుడితో కలిసి భార్య రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..!
Husband Caught His Wife
Balaraju Goud
|

Updated on: Jun 12, 2021 | 2:03 PM

Share

Husband Caught His Wife with Her Lover Red Handed: పెళ్లి చేసుకుని భార్యతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న భర్తకు ఓ విషయం తెలిసి షాక్ అయ్యాడు. పెళ్లి జరిగిన తరువాత కూడా తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న భర్త భార్యకు అనేకసార్లు వార్నింగ్ ఇచ్చాడు. భర్త హెచ్చరికలను భార్య పెడచెవిన పెట్టింది. భార్య, ఆమె ప్రియుడు భర్తకు బెడ్‌రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయారు.

ప్రియుడితో కలిసి ఉండగా తన భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు ఓ భర్త. వారిద్దరినీ ఓ గదిలో బంధించి, పోలీసులకు సమాచారం అందించాడు. అయితే చాలా సేపు బయటకి రాకుండా లోపలే గడియ పెట్టుకుని పోలీసులకు చుక్కలు చూపించారు. దాదాపు 4 గంటల వరకు గదిలోనే ఉండిపోయారు. ఆ తర్వాత వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

నిర్మల్‌ జిల్లా భైంసాలోని ఏపీనగర్‌లో తన భార్యతో కలిసి ఉంటున్నాడు రాజు. అయితే, తన భార్య, ప్రియుడు రూపేష్‌తో కలిసి ఉండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు రాజు. అంతేకాదు వారిద్దరినీ గదిలో పెట్టి తాళం వేసి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రాజు ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు, వివాహేతర జంటను పట్టుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. గదిలో గడియపెట్టుకున్న జంట, దాదాపు 4 గంటల పాటు బయటకి రాకుండా అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత గదిలో నుంచి బయటకి వచ్చిన వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు భైంసా పోలీసులు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Read Also… Elephants Attacking: విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి.. గున్న ఏనుగు కోసం ఏకంగా గజరాజుల గుంపు గ్రామాలపై దండయాత్ర!