Exoplanet like Earth: అనంత విశ్వంలో మరో ‘భూమి’ కనిపించింది..మనకు 90 కాంతి సంవత్సరాల దూరంలో..నాసా శాస్త్రవేత్తల ప్రకటన!

Exoplanet like Earth: విశ్వం రహస్యాలను తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు చేయని ప్రయత్నం లేదు. అందులోనూ మన భూమి లాంటి గ్రహం.. మనలాంటి జీవులూ అనంత విశ్వంలో ఇంకా ఉండి ఉండవచ్చని పరిశోధకులు నమ్ముతారు.

Exoplanet like Earth: అనంత విశ్వంలో మరో 'భూమి' కనిపించింది..మనకు 90 కాంతి సంవత్సరాల దూరంలో..నాసా శాస్త్రవేత్తల ప్రకటన!
Exoplanet Like Earth
Follow us
KVD Varma

|

Updated on: Jun 12, 2021 | 2:07 PM

Exoplanet like Earth: విశ్వం రహస్యాలను తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు చేయని ప్రయత్నం లేదు. అందులోనూ మన భూమి లాంటి గ్రహం.. మనలాంటి జీవులూ అనంత విశ్వంలో ఇంకా ఉండి ఉండవచ్చని పరిశోధకులు నమ్ముతారు. అదేవిశాయంపై పరిశోధనల్లో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలో అంతరిక్షంలో విస్తృత పరిశోధనలు సాగిస్తువస్తున్నారు. ఇప్పుడు ఈ పరిశోధనల్లో మరో ముందడుగు పడింది. అచ్చం మన భూమిలానే ఉండే మరో గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. మనకు 90 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం వేగంగా కదులుతోంది. ఇది మన భూమి కంటె… ఐదున్నర రెట్లు పెద్దదిగా చెబుతున్నారు. ఈ గ్రహం ఒక బలమైన నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందట. ఇక్కడ నీటి మేఘాలతో కూడిన వాతావరణం ఉంది. ఈ గ్రహంపై ఉష్ణోగ్రత సుమారు 57 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ఎక్సోప్లానెట్ కు TOI-1231 b అని పేరుపెట్టారు.

ఎక్సోప్లానెట్ వాతావరణంలో శాస్త్రవేత్తలు మేఘాల సాక్ష్యాలను గుర్తించారు. బహుశా ఇవి నీటితో కూడినవి కూడా కావచ్చని నాసా చెబుతోంది. ఈ నక్షత్రం, గ్రహం వ్యవస్థ భూమికి దూరంగా అధిక వేగంతో కదులుతోంది, TOI-1231 b వాతావరణం నుండి హైడ్రోజన్ అణువులను కూడా కనుగొనవచ్చు, అంటే గ్రహం ‘తోక’ కలిగి ఉంటుంది. ఈ ఎక్సోప్లానేట్ సంవత్సరంలో 24 రోజుల నిడివి ఉన్న నక్షత్రం చుట్టూ ఒకసారి తిరుగుతుంది. అంటే ఆ నక్షత్రం ఒకసారి తిరగడానికి ఈ గ్రహానికి 24 రోజులు పడుతుంది. నక్షత్రానికి సామీప్యత ఉన్నప్పటికీ, TOI-1231 b సాపేక్షంగా చల్లగా ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహం పై మరిన్ని పరిశోధనలు జరపడానికి శాస్త్రవేత్తలు సిద్ధం అవుతున్నారు. మొత్తానికి భూమిలాంటి గ్రహం ఇంకొకటి విశ్వంలో ఉంది అని తేలడం శాస్త్రవేత్తలకు సంతోషాన్నిస్తోంది.

Also Read: Solar Eclipse 2021: ప్రపంచ వ్యాప్తంగా కనువిందు చేసిన సూర్యగ్రహణం.. అద్భుతమైన ఫోటోలను షేర్ చేసిన నాసా.. చూస్తే వావ్ అనాల్సిందే..

Zhurong Rover: చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ చిత్రాలను తీసిన అమెరికకు చెందిన ఉపగ్రహం