Zhurong Rover: చైనాకు చెందిన జురాంగ్ రోవర్ చిత్రాలను తీసిన అమెరికకు చెందిన ఉపగ్రహం
Zhurong Rover: అమెరికన్ ఉపగ్రహం మార్స్ ఉపరితలంపై చైనాకు చెందిన జురాంగ్ రోవర్‌ను చిత్రీకరించింది. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్‌తో కొద్ది దూరం నుంచి జురాంగ్ రోవర్..
Zhurong Rover: అమెరికన్ ఉపగ్రహం మార్స్ ఉపరితలంపై చైనాకు చెందిన జురాంగ్ రోవర్‌ను చిత్రీకరించింది. మార్స్ రికనైసెన్స్ ఆర్బిటర్‌తో కొద్ది దూరం నుంచి జురాంగ్ రోవర్ ల్యాండింగ్ చిత్రాలను బంధించింది. చైనా జురాంగ్ రోవర్ (Zhurong rover) యుటోపియా ప్లానిటియాలో దిగిన తరువాత మార్స్ ఉపరితలం నుంచి మొదటి చిత్రాలను పంపిన విషయం తెలిసిందే. మార్స్ నుంచి రోవర్ పంపిన రెండు కొత్త ఫొటోలను చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) విడుదల చేసింది. అందులో ఒకటి రంగులతో మెరిసిపోతుండగా.. మరొకటి బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తోంది. ఈ రెండు ఫొటోల్లో కనిపించే రోవర్ ల్యాండర్ ఉన్న యుటోపియా ప్లానిటియా ప్రదేశంలో కనిపిస్తోంది. అయితే మే 14న రోవర్ ల్యాండ్ అయింది. అయితే మార్స్ ఆర్బిటర్ పంపిన చిత్రాలు జురాంగ్ రోవర్‌ను దాని ల్యాండింగ్ ప్లాట్‌ఫాం ముందు కొద్ది దూరంలో చూపిస్తుంది. అయితే కొన్ని రోజుల తర్వాత వాహనం ప్లాట్‌ఫాం ర్యాంప్‌లోకి వెళ్లడం యొక్క చిత్రాలను విడుదల చేసిన తర్వాత చైనా అధికారులు ల్యాండింగ్ చిత్రాలను విడుదల చేసేందుకు ఆలస్యం చేసింది. రోవర్ మార్టిన్ వాతావరణంలోకి అడుగుపెట్టింది. చైనా టియాన్వెన్ -1 నుంచి విడిపోయిన తరువాత ల్యాండర్‌తో కలిసిపోయింది. జురాంగ్ ఆరు చక్రాలను మొదటిసారిగా మార్టిన్ ఉపరితలంపై నిలబడేందుకు వీలుగా లాండర్ ఒక చిన్న ర్యాంప్‌ను పంపింది. రోవర్ నావిగేషన్ కెమెరాలలో జురాంగ్ నాలుగు రెక్కలతో కూడిన సోలార్ ప్యానెల్ కమ్యూనికేషన్ యాంటెన్నా ఉంది.
ఫిబ్రవరిలో మార్టిన్ కక్ష్యకు చేరుకున్న టియాన్వెన్ -1 మిషన్ అంగారక గ్రహంపై విజయవంతంగా చైనా ల్యాండ్ చేసింది. ఇప్పటివరకూ అమెరికా మాత్రమే రెడ్ ప్లానెట్‌లో రోవర్లను విజయవంతంగా ల్యాండ్ చేసింది. అమెరికా తర్వాత అంగారకుడిపై రోవర్ ల్యాండ్ చేసిన రెండో దేశంగా చైనా అవతరించింది. ఈ రోవర్ సుమారు మూడు నెలల (90 రోజులు) పాటు అంగారకుడిపై అన్వేషణ కొనసాగించనుంది. జురాంగ్ రోవర్ ఆరు చక్రాలతో 530-పౌండ్లు. (240 కిలోగ్రాములు) బరువు ఉంది. యుటోపియా ప్లానిటియా ప్రాంతంలో భూగర్భ శాస్త్రం, వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి రోవర్ తన ఆరు పరికరాలను ఉపయోగించనుంది. ఈ రోవర్ సుమారు మూడు నెలల (90 రోజులు) పాటు అంగారకుడిపై అన్వేషణ కొనసాగించనుంది.