Livable Cities: అన్నింటినీ అతాల‌కుత‌లం చేసేసిన క‌రోనా.. నివాస‌యోగ్య న‌గ‌రాల‌ను సైతం మార్చేసింది..

Livable Cities: క‌రోనా మ‌హ‌మ్మారి ఒక ప్రాంతం, దేశం అనే తేడా లేకుండా యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించింది. మాన‌వ స‌మాజాన్ని మొత్తం షేక్ చేసిందీ మాయ‌దారి రోగం. ప్రపంచంలో అగ్ర‌దేశంగా నిలిచిన అమెరికాలాంటి దేశాలు...

Livable Cities: అన్నింటినీ అతాల‌కుత‌లం చేసేసిన క‌రోనా.. నివాస‌యోగ్య న‌గ‌రాల‌ను సైతం మార్చేసింది..
Livable Cities
Follow us

|

Updated on: Jun 10, 2021 | 9:38 PM

Livable Cities: క‌రోనా మ‌హ‌మ్మారి ఒక ప్రాంతం, దేశం అనే తేడా లేకుండా యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించింది. మాన‌వ స‌మాజాన్ని మొత్తం షేక్ చేసిందీ మాయ‌దారి రోగం. ప్రపంచంలో అగ్ర‌దేశంగా నిలిచిన అమెరికాలాంటి దేశాలు కూడా కంటికి క‌నిపించ‌ని ఓ వైర‌స్ కార‌ణంగా చిగురుటాకులా వ‌ణికిపోయాయి. దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోయాయి. అన్నింటిని చిన్నాభిన్నం చేసిన క‌రోనా.. నివాస‌యోగ్య‌మైన నగరాల‌ను సైతం మార్చేసింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌పంచంలోని కొన్నిన‌గ‌రాలు నివాస‌యోగ్య‌మైన న‌గ‌రాలు త‌మ స్థానాన్ని కోల్పోయిన‌ట్లు ‘ది ఎకానమిస్ట్‌’ వార్షిక సర్వే వెల్లడించింది. క‌రోనా కార‌ణంగా ఐరోపా దేశాల్లోని కొన్ని న‌గ‌రాలు.. వాటి నివాసయోగ్యతను కోల్పోయినట్లు సర్వే తెలిపింది. ఈ జాబితాలో ప్ర‌తీసారి ముందుండే.. ఐరోపా నగరాలన్నీ ఈసారి తమ స్థానాల్ని కోల్పోయాయి. ఇక క‌రోనాను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌లోని మహానగరాలు ఈ సారి ఈ జాబితాలో ముందునిల‌వ‌డం విశేషం. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగరం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. ఇక జపాన్‌లోని ఒసాకా, ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌, మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్‌, పెర్త్‌ న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌, జపాన్‌లోని టోక్యో, స్విట్జర్లాండ్‌లోని జెనీవా జాబితాలో తొలి పదిస్థానాల్లో నిలిచాయి. పదింటిలో ఆరు ఆస్ట్రేలియాలోని నగరాలే కావడం విశేషం.

Also Read: SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసిన, కొత్త ఏటీఎం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

కోవిద్ రోగుల మృతదేహాలను పడేయడానికి ముంబైలో నది లేదు…..మేయర్ ఖండన ..కానీ …..

Attack On Police: ప‌టాన్‌చెరులో విచార‌ణ‌కోసం వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడికి దిగిన వ్యక్తులు.. అరెస్ట్ చేసిన‌..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!