కోవిద్ రోగుల మృతదేహాలను పడేయడానికి ముంబైలో నది లేదు…..మేయర్ ఖండన ..కానీ …..
కోవిద్ రోగుల మృత దేహాలను పడవేయడానికి ముంబైలో నది లేదని మేయర్ కిషోరీ పెడ్నేకర్ అన్నారు. కోవిద్ మరణాలను తక్కువగా చూపుతున్నారని ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండిస్తూ.. కొన్ని రాష్ట్రాల్లో..
కోవిద్ రోగుల మృత దేహాలను పడవేయడానికి ముంబైలో నది లేదని మేయర్ కిషోరీ పెడ్నేకర్ అన్నారు. కోవిద్ మరణాలను తక్కువగా చూపుతున్నారని ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండిస్తూ.. కొన్ని రాష్ట్రాల్లో..ముఖ్యంగా యూపీ , బీహార్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నదుల్లో డెడ్ బాడీలను పారవేస్తున్నారని.గంగా నదిలో ఆమధ్య వందలాది మృతదేహాలు తేలియాడినట్టు వార్తలు వచ్చాయని అన్నారు. అలాగే ఆ నది ఒడ్డున గల ఘాట్లలో కూడా ఖననం చేశారన్నారు. మేం కోవిద్ మరణాల సంఖ్యను దాచిపెట్టడం లేదు అని ఆమె చెప్పారు. ఈ మరణాల రేట్లను మూడు చోట్ల నమోదు చేస్తున్నామని, అందువల్ల డేటాను కప్పి ఉంచడమనే మాటే తలెత్తదని ఆమె అన్నారు. బీజేపీ ఆరోపణలకు మేయర్ స్పందించడం ఇదే మొదటిసారి.. కోవిద్ మొదటి-రెండో వేవ్ సందర్భాల్లోనూ కోవిద్ రోగుల మృత దేహాలను ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే టెస్టులు ఎక్కువగా చేసినప్పుడు వాస్తవ పరిస్థితి తెలుస్తుందని, పాండమిక్ ను అదుపు చేయాలంటే ఇది అత్యవసరమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంతో బీజేపీ నేతలు చల్ల బడ్డారు.
ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే.. ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన అనంతరం శివసేన నేతల్లో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఈ పార్టీ నేత సంజయ్ రౌత్ మోదీని, ఆయన నాయకత్వాన్ని ప్రశంసించిన అనంతరం.. ఇప్పుడు గతంలో మాదిరి కమలం పార్టీని వీరు విమర్శించడం మానుకున్నట్టు భావిస్తున్నారు.ఎన్సీపీ నేత శరద్ పవార్ కూడా ఇటీవల బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో . ముంబై మేయర్ కూడా తగ్గారు. మొదట ఆ విధంగా మాట్లాడినప్పటికీ ఆ తరువాత ఆమె వైఖరిలో మార్పు వచ్చింది.
మరిన్ని ఇక్కడ చూడండి: రెచ్చిపోతున్న ఆకతాయిలు హైదరాబాద్ పోలీసుల మీద ఎటాక్ చేసిన యువత :young mans attack on police video.