Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

SBI ATM: ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో బయటకు వెళ్లలేని పరస్థితి ఉంది. ఇక బ్యాంకులకు వెళ్లి ఏదైనా పనులు చేసుకోవాలన్న వెళ్లని పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు..

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!
SBI Customer Alert
Follow us
Subhash Goud

|

Updated on: Jun 13, 2021 | 1:35 PM

SBI ATM: ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో బయటకు వెళ్లలేని పరస్థితి ఉంది. ఇక బ్యాంకులకు వెళ్లి ఏదైనా పనులు చేసుకోవాలన్న వెళ్లని పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు కూడా బ్యాంకులకు వెళ్లకుండానే ఇంటి వద్దే ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నాయి. బ్యాంకుకు సంబంధించిన ఏ పనులు కూడా జరగాలన్నా.. ఇంటి వద్దే ఉండి ఆన్‌లైన్‌లో చేసుకునే వెసులుబాటు కల్పించాయి. ఇక  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆన్‌లైన్‌ సర్వీసు సౌకర్యాలను మరింత పెంచింది. తాజాగా ఏటీఎం కోసం దరఖాస్తు చేసుకునేవారికి మరింత సౌకర్యం కల్పించింది. ఎవరైనా ఎస్‌బీఐ ఏటీఎం కోల్పోయినట్లయితే, లేదా ఏటీఎం గడువు ముగిసినా, పాడైపోయినా మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు ఆన్‌లైన్‌లో కొత్త ఏటీఎం కార్డు కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మీరు ఏటీఎం డెబిట్‌ కార్డు పొందాలంటే కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. అకౌంట్‌కు మీ మొబైల్‌ నెంబర్‌ నమోదు చేసి ఉండాలి. ఎందుకంటే ఆ మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP- One-time password) ఉపయోగించి మీరు ఈ పనిని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

➦ ముందుగా ఎస్‌బీఐ ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లాగిన్‌ కావాలి. ➦ ఆ తర్వాత ఈ- సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి. ➦ మీరు ఏటీఎం కార్డ్‌ సేవలను ఎంచుకోవాలి ➦ తర్వాత కనిపించే రెండు ఆప్షన్లలో ఓటీపీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ➦ తర్వాత కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మీరు కార్డు పేరు, ఇతర వివరాలు పూర్తి చేయాలి. ➦ అన్ని వివరాలు పూరించిన తర్వాత ధృవీకరించాలని అడుగుతుంది. ➦ ధృవీకరించిన తర్వాత మీ డెబిట్‌ కార్డు 7-8 పని దినాల్లో మీ అడ్రస్‌కు వస్తుందనే మెసేజ్‌ వస్తుంది. ➦ ఇంకో విషయం ఏంటంటే మీరు ఏటీఎం ఇతర చిరునామాలలో పొందాలనుకుంటే మీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సందర్శించాలి.

అలాగే ఎస్‌బీఐ వినియోగదారులకు తమ ఖాతాల్లో కొత్త మొబైల్‌ నెంబర్‌ అప్‌డేట్‌ చేసుకోవడం ఇప్పుడు సులభతరమైంది. నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా ఇది చేసుకోవచ్చు. నెట్‌ బ్యాంక్‌ లోకి వెళ్లి ఎగువన ఉన్న మీ వ్యక్తిగత వివరాలు, మొబైల్‌ సంబంధించి ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని మొబైల్‌ నెంబర్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. భారీ ఊరట.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..!

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

LPG Gas Connection: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాగంటే..!