AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. భారీ ఊరట.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..!

LPG Customers: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెల్లడించింది. ఈ ప్రకటనతో చాలా మందికి ప్రయోజనం..

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. భారీ ఊరట.. కొత్త సర్వీసులు అందుబాటులోకి..!
LPG customers
Subhash Goud
|

Updated on: Jun 10, 2021 | 7:55 PM

Share

LPG Customers: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులకు ఊరట కలిగించే ప్రకటన వెల్లడించింది. ఈ ప్రకటనతో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. నచ్చిన డిస్ట్రిబ్యూటర్ నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. కేంద్రం ప్రకటనతో గ్యాస్‌ సిలిండర్‌ వాడే వారు తమకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ నుంచి గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారుల ఇంటి అడ్రస్‌కు డెలివరీ సర్వీసు అందజేసే డిస్ట్రిబ్యూటర్లలో నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ సేవలను వినియోగదారులకు అందించనున్నాయి.

ప్రస్తుతం ఈ సర్వీసులు ఎక్కడెక్కడ అంటే..

ప్రస్తుతం ఈ సర్వీసులను కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించింది కేంద్రం. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పైలెట్‌ ప్రాజెక్టు కింద ప్రారంభిస్తున్నట్లు పెట్రోలియం శాఖ వెల్లడించింది. అవి ఎక్కడెక్కడ అంటే.. ఛండీఘర్, కోయంబత్తూరు, గురుగావ్, రాంచీలలో ఈ సేవలు పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. ఇక త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సర్కార్‌ వెల్లడించింది.

డిస్ట్రిబ్యూటర్ల రేటింగ్‌..

అయితే వినియోగదారులు గ్యాస్‌ సిలిండర్‌ను మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవచ్చు. వారి ఇంటికి సిలిండర్‌ డెలివరీ చేసే డిస్ట్రిబ్యూటర్ల జాబితా కనిపిస్తుంది. వారి పనితీరు రేటింగ్‌ కూడా కనిపిస్తుంది. ఇందులో కస్టమర్లు వారికి నచ్చిన డిస్ట్రిబ్యూటర్‌ను ఎంచుకోవచ్చు. వారే మీ ఇంటికి సిలిండర్ డెలివరీ చేస్తారు. ఈ సేవల ద్వారా గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు ఎంతో మేలు జరుగనుంది. మున్ముందు దేశంలోని మరిన్ని ప్రాంతాలకు ఈ సేవలను విస్తరించనుంది కేంద్రం.

ఇవీ కూడా చదవండి:

LPG Gas Connection: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాగంటే..!

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Amazon Flipkart: పోటాపోటీగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్‌

చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే..
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్న సూర్య..అమెరికా టార్గెట్ 162
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
ఇదేం పిచ్చిరా బాబా.. రీల్‌ రీక్రియేట్ చేస్తుండగా జారీన ఛైర్..
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
రోజూ ఓ గ్లాస్‌ రెడ్‌ వైన్‌ తాగితే గుండె ఆరోగ్యానికి మంచిదా?
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
బెస్ట్‌ స్కీమ్‌- ప్రతిరోజూ రూ.333 ఆదా చేస్తే చేతికి రూ.17 లక్షలు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
రాయల్ లుక్‌లో యంగ్‌ బ్యూటీ సారా అర్జున్‌.. మతిపోగొట్టేలా ఫోజులు!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
చీకట్లో మగ్గుతున్న గిరి పుత్రుల జీవితాల్లో వెలుగులు..!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
కుంభ రాశిలో త్రిగ్రాహి రాజయోగం.. వీరికి పట్టిందల్లా బంగారమే!
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టాలీవుడ్ యంగ్ హీరో
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!
నోట్లో వేయగానే కరిగిపోతుంది.. తందూరి చికెన్ ఇంట్లో ఇలా చేయండి!