EMI: అకౌంట్‌లో ఈఎమ్ఐకి సరిపడ డబ్బులు ఉండడంలేదు.. భారీగా పెరుగుతోన్న ఆటో డెబిట్ తిరస్కరణలు..
Auto Debit EMI: కరోనా మహమ్మారి మనుషులు ఆరోగ్యాలతోపాటు ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ వైపు వైరస్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుంటే మరోవైపు.. లాక్‌డౌన్ ఆంక్షలు, ఉద్యోగాలు కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక...
Auto Debit EMI: కరోనా మహమ్మారి మనుషులు ఆరోగ్యాలతోపాటు ఆర్థిక వ్యవస్థలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ వైపు వైరస్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుంటే మరోవైపు.. లాక్‌డౌన్ ఆంక్షలు, ఉద్యోగాలు కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే రుణాలు తీసుకొని ఈఎమ్ఐలు చెల్లించే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (నాచ్) ఇదే విషయాన్ని చెబుతోంది.
రుణాలు తీసుకున్న వారు ఆటో-డెబిట్ విధానంలో చెల్లించే లావాదేవీల తిరస్కరణ రేటు వరుసగా రెండో నెలా పెరిగిందని నాచ్ తెలిపింది. మే నెలలో మొత్తం 85.7 మిలియన్ ఆటో డెబిట్ లావాదేవీల్లో.. 30.8 మిలియన్(35.91 శాతం) లావాదేవీలు తిరస్కరణకు గురయ్యాయి. ఏప్రిల్‌లో 85.4 మిలియన్ లావాదేవీల్లో 29.08 మిలియన్(34.05శాతం) తిరస్కరణకు లోనయ్యాయి. ఆదాయాలు తగ్గడం, ఉద్యోగాలు కోల్పోవడంతో రుణాలు తీసుకున్న వారు ఆటో డెబిట్ సమయానికి అకౌంట్‌లో సరిపడ నగదును నిల్వ ఉంచలేకపోతున్నారు. మరి కరోనా మహమ్మారి సృష్టిస్తోన్న ఈ సంక్షోభం నుంచి మానవాళి ఎప్పడు భయపడుతుందో చూడాలి.
Viral News: ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..