AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: ప్రపంచంలో అపర కుబేరులు.. పన్నుల చెల్లింపులో పాపం నిరుపేదలు.. ఎవరో.. ఏమిటో..ఎలానో తెలుసుకోండి..

Income Tax: ఒక ఉద్యోగి నిజాయతీగా ప్రతి సంవత్సరం తన సంపాదనకు సంబంధించి టాక్స్ కచ్చితంగా కట్టేస్తాడు. అతను ప్రభుత్వ ఉద్యోగి అయినా, కార్పోరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అయినా పన్ను చెల్లించడం విషయంలో ఏమాత్రం అలసత్వం చూపించరు.

Income Tax: ప్రపంచంలో అపర కుబేరులు.. పన్నుల చెల్లింపులో పాపం నిరుపేదలు.. ఎవరో.. ఏమిటో..ఎలానో తెలుసుకోండి..
Income Tax
KVD Varma
|

Updated on: Jun 10, 2021 | 8:17 PM

Share

Income Tax: ఒక ఉద్యోగి నిజాయతీగా ప్రతి సంవత్సరం తన సంపాదనకు సంబంధించి టాక్స్ కచ్చితంగా కట్టేస్తాడు. అతను ప్రభుత్వ ఉద్యోగి అయినా, కార్పోరేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి అయినా పన్ను చెల్లించడం విషయంలో ఏమాత్రం అలసత్వం చూపించరు. చూపించలేరు కూడా. ఎందుకంటే, ఆ కంపెనీలు కూడా ప్రతి సంవత్సరం తమ దగ్గర ఉన్న ఉద్యోగుల జీతాల లెక్కలు చూసి ఆదాయపు పన్ను రిటర్న్స్ అవే దాఖలు చేసి.. వారి పన్ను వారి జీతం నుంచే తెగ్గోసి ప్రభుత్వానికి నిజాయతీగా కట్టేస్తాయి. ఇదే వాస్తవం. మరి ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను కట్టాల్సిందే కదా. ఈ విషయంలో ఉద్యోగులూ ఏమీ అనుకోరు. అయితే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇవ్వబోతున్న వివరాలు చూస్తె.. మీరు కచ్చితంగా అయోమయంలో పడతారు. ఎందుకంటే ఎంత డబ్బు సంపాదిస్తే అంత పన్ను కట్టాల్సి వస్తుంది.. ప్రభుత్వాలూ ఆ పన్నులు వసూలు చేస్తాయి అనుకుంటాం. కానీ, ప్రపంచంలోని అగ్రధనవంతులుగా చలామణీ అవుతూ కోవిడ్ మహమ్మారి సమయంలోనూ తమ ఆస్తుల లెక్కల్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్న కుబేరుల్లో చాలా మంది పన్నులు సక్రమంగా చెల్లించడం లేదట. అవును ఇది వాస్తవం.

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్, బ్లూమ్‌బెర్గ్ యాజమాని మైఖేల్ బ్లూమ్‌బెర్గ్, వర్క్‌షైర్ హాత్వే స్థాపకుడు వారెన్ బఫ్ఫెట్‌తో సహా ప్రపంచంలోని అగ్ర ధనవంతులు చాలా తక్కువ ఆదాయపు పన్నును చెల్లిస్తున్నారట. కొన్ని సంవత్సరాలయితే, ఈ కుబేరులు అసలు పన్ను చెల్లించలేదని ప్రోపబ్లికా అనే వార్తా సంస్థ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, 2014-2018 మధ్య, అమెరికాలోని టాప్ -25 బిలియనీర్లు చాలా తక్కువ పన్ను చెల్లించారు.

అమెరికన్ టాక్స్ ఏజెన్సీ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) పత్రాల ప్రకారం, ఈ 2014-2018లో, ఈ ప్రభువుల ఆదాయం రూ .29.26 లక్షల కోట్లు. వారు కేవలం రూ .99 వేల కోట్లు మాత్రమే పన్నుగా చెల్లించారు. అమెజాన్ సీఈఓ బెజోస్ గురించి ఈ నివేదిక ఇలా చెప్పింది.. ”2007 లో అమెజాన్ షేర్లు విలువ రెట్టింపు అయినప్పటికీ, అతను 2007 లో పన్ను చెల్లించలేదు.”

ఈ బిలియనీర్ త్రయం మొత్తం నికర విలువ 34 లక్షల కోట్లు, అయినప్పటికీ.. టెస్లా యజమాని మస్క్ 2018 లో పన్ను చెల్లించలేదు, బెజోస్ పన్ను కట్టడాన్ని నిరాకరించారు. 2014 మరియు 2018 మధ్య, ఆయన సంపద రూ .1.88 లక్షల కోట్లు పెరిగింది, కాని పన్ను 3 వేల కోట్లు చెల్లించారు. బెర్క్‌షైర్ హాత్‌వే సీఈఓ బఫ్ఫెట్ 2014-2018లో కేవలం 173 కోట్ల రూపాయలు మాత్రమే పన్ను చెల్లించారు. ఈ కాలంలో ఆయన సంపద రూ .1.77 లక్షల కోట్లు పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ సూచిక ప్రకారం, ఈ మూడింటి మొత్తం నికర విలువ సుమారు రూ .34 లక్షల కోట్లు.

స్థూలంగా లెక్క ఇదీ.. జెఫ్ బెజోస్                      13.86 లక్షల కోట్లు ఎలోన్ మస్క్                  12.18 లక్షల కోట్ల రూపాయలు వారెన్ బఫెట్                    7.95 లక్షల కోట్లు మొత్తం                            34 లక్షల కోట్ల రూపాయలు

పన్ను నిబంధనలలోని లొసుగులను సద్వినియోగం చేసుకుని, 2011 లో, బెజోస్ నికర విలువ 86 వేల కోట్లు, కాని అతను నష్టాన్ని చూపించడం ద్వారా పిల్లల పేరిట రెండు లక్షల రూపాయల పన్ను క్రెడిట్ తీసుకున్నాడు. ప్రోపబ్లికా ఫోర్బ్స్ యొక్క డేటా నుండి ఈ నివేదికను తయారు చేసింది. ఈ ధనవంతులు అమెరికా పన్ను వ్యవస్థలోని లోపాలను సద్వినియోగం చేసుకున్నారని అది పేర్కొంది. వారు సంపాదించేది అమెరికాలో పన్ను విధించబడే సొమ్ము కాదని వారు చూపించారు. వారి ఆదాయం కంపెనీల వాటాలు, విహార గృహాలు, పడవలు, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం లేని ఇతర పెట్టుబడుల నుండి వస్తుందని వారు పన్ను నుంచి తప్పించుకున్నారు. అదండీ విషయం డబ్బుంటే ఏదైనా చేయొచ్చు.. ఆఖరికి పన్నులు ఎగ్గొట్టినా వారికి చట్టాల లొసుగులు గుడుగులు పడతాయి.

Also Read: Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

Seema Patil: ఆమె జీతం రూ.100 కోట్లు.. ట్రెండింగ్ కంపెనీలకు రోల్‌మోడల్.. జీరోధా కంపెనీ డైరెక్టర్