Amazon Flipkart: పోటాపోటీగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్‌

Amazon Flipkart: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. సేవింగ్స్‌ డేస్‌ పేరుతో భారీ డిస్కౌంట్లు..

Amazon Flipkart: పోటాపోటీగా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్లు.. స్మార్ట్‌ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్‌
Amazon mobile saving days sale.. and Flipkart Big Saving Days Sale
Follow us
Subhash Goud

|

Updated on: Jun 10, 2021 | 7:26 PM

Amazon Flipkart: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజాలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. సేవింగ్స్‌ డేస్‌ పేరుతో భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ మరో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్‌, నోకాస్ట్‌ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ వంటి ఆఫర్లను అందిస్తోంది. మొబైల్‌ సేవింగ్స్‌ డేస్‌ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్‌ ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ సేల్‌ జూన్‌ 12 వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డుతో కొనుగోలు చేసినట్లయితే వెయ్యి రూపాయల వరకు ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంటుంది. అలాగే రియల్‌మీ, శాంసంగ్‌, వివో, షియోమీ తదితర బ్రాండేడ్‌ ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది.

మరోవైపు ఫ్లిప్‌కార్ట్‌ కూడా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో నిర్వహించనున్న సేల్‌ ఈనెల 13 నుంచి 16 వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్‌ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలపై భారీ ఆఫర్లు, డీల్స్‌, డిస్కౌంట్లను అందించనుంది. ఎస్‌బీఐ కార్డు ద్వారా ఆర్డర్స్‌ చేస్తే వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టాంట్‌ తగ్గింపును అందిస్తుంది. ఇలా పోటాపోటీగా భారీ ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!

LPG Gas Connection: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాగంటే..!

Savings Account: మంచి రాబడులు వచ్చేందుకు పెట్టుబడులు.. పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు అందించే బ్యాంకులు..!