Nandamuri Balakrishna Interview :త్వరలోనే మోక్షజ్ఞతో కలిసి నటించబోతున్నా.. ఆసక్తికర విషయాలను తెలిపిన బాలయ్య

నట సింహం బాలకృష్ణ సినీకెరీయర్ లో చేయని పాత్రలు లేవంటే అతిశయోక్తికాదు. దాదాపు అన్నీ జోనర్లను బాలయ్య టచ్ చేసారు.

Nandamuri Balakrishna Interview :త్వరలోనే మోక్షజ్ఞతో కలిసి నటించబోతున్నా.. ఆసక్తికర విషయాలను తెలిపిన బాలయ్య
Balakrishna
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 8:40 PM

Nandamuri Balakrishna: నట సింహం బాలకృష్ణ సినీకెరీయర్ లో చేయని పాత్రలు లేవంటే అతిశయోక్తికాదు. దాదాపు అన్నీ జోనర్లను బాలయ్య టచ్ చేసారు. నటనతో , అద్భుతమైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో ఆకట్టుకున్నారు బాలయ్య. తెలుగు రాష్ట్రాలలో అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. బాలయ్య సినిమా అంటే అభిమానులకు పండగే. అభిమానులు బాలయ్య బాబు అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకుంటారు. సినీ రాజకీయంగా బాలయ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించవద్దని తమ అభిమానులను బాలయ్య కోరారు. అయితే బాలయ్య బర్త్ డే హడావిడి అంతా సోషల్ మీడియాలో కనిపిస్తోంది.తాజాగా నందమూరి బాలకృష్ణ టీవీ 9టీతో ముచ్చటించారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. త్వరలోనే ఆయన కుమారుడు మోక్షజ్ఞ ను ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్ననని అన్నారు. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ఆదిత్య 369 సీక్వెల్ లో  ఇద్దరు కలిసి నటించనున్నామని బాలకృష్ణ తెలిపారు.