దృశ్యం సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన “దృశ్యం2” సినిమా ఓటీటీలో రిలీజై ఎంతలా ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడీ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలతో పాటు మరో చైనా భాషలో కూడా రీమేక్ అవుతోంది. ఈ మధ్య ఇండియన్ సినిమాలకు చైనాలో మంచి డిమాండ్ ఏర్పడింది. అక్కడ మార్షల్ ఆర్ట్స్ ప్రాధాన్యం ఉన్న సినిమాలను చూసి విసిగిపోయిన చైనా ప్రజలు ఇండియన్ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టే మన మేకర్స్ కూడా చైనీస్ భాషలోకి సినిమాలను డబ్ చేస్తూ..రిమేక్ చేస్తూ అక్కడి మార్కెట్ ను ఒడిసిపట్టుకుంటున్నారు.
ఇదే క్రమంలో దృశ్యం2 సినిమా కూడా చైనీస్ భాషలో రిమేక్ అవుతోంది. “షీప్ విత్ అవుట్ ఏ షెపర్డ్” అనే పేరుతో తెరకెక్కబోతోంది. ఇప్పుడిదే విషయం త్రూ అవుట్ ఇండియ వైరల్ అవుతోంది. ఇక ఇప్పుటికే తెలుగులో దృశ్యం2 షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. మలయాళ మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫే తెలుగులోనూ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక తొందర్లో ఓ ప్రముఖ ఓటీటీ వేదికగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ మేకర్స్ ప్లాన్ కూడా చేస్తున్నారని.. ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :