Parineeti Chopra: ఆ తప్పు మేకర్స్ దే అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ఇక పై అలాంటి సినిమాలే చేస్తానంటున్న పరిణితి..

స్టార్ ఫ్యామిలీ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా.. డెబ్యూ సినిమాలోనే అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు.

Parineeti Chopra: ఆ తప్పు మేకర్స్ దే అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ఇక పై అలాంటి సినిమాలే చేస్తానంటున్న పరిణితి..
Parineeti Chopra
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 6:23 PM

Parineeti Chopra: స్టార్ ఫ్యామిలీ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పరిణితి చోప్రా.. డెబ్యూ సినిమాలోనే అవార్డ్ విన్నింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఆ తరువాత నటిగా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ పెద్దగా రాకపోయినా.. గ్లామర్ ఇమేజ్‌తో కెరీర్‌ను బాగానే నెట్టుకొస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు అయిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన పరిణితి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తన కెరీర్‌లో గత ఐదేళ్లుగా ఇష్టం లేని సీన్స్, సినిమాలు చాలా చేశానన్నారు ఈ బ్యూటీ. కొన్ని సీన్స్‌లో నటించటం కంఫర్టబుల్‌గా అనిపించకపోయినా ఆ పరిస్థితుల్లో ఒకే చెప్పాసానని ఫీల్‌ అయ్యారు. తనకు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే టాలెంట్ ఉన్నా కూడా.. మేకర్స్ మాత్రం తనను గ్లామర్ ఇమేజ్‌కే పరిమితం చేశారంటున్నారు పరిణితి.

అందుకే తన కెరీర్‌ను తానే కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఇక మీదట రొటీన్ సినిమాలు చేయకూడదని ఫిక్స్ అయ్యానంటున్నారు. ఇప్పటికే సెలక్షన్‌ స్టైల్‌ మార్చేశానని.. అందుకే ది గర్ల ఆన్‌ ది ట్రైన్‌, సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌, సైనా లాంటి సినిమాలు చేశానన్నారు. ఫ్యూచర్‌లోనూ పెర్ఫామెన్స్ కు స్కోప్‌ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానంటున్నారు పరిణితి చోప్రా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nandamuri: మ‌రో నంద‌మూరి వార‌సుడి ఎంట్రీకి రంగం సిద్ధం.. బాల న‌టుడిగా ప‌రిచ‌యం కానున్న జూనియ‌ర్‌ త‌న‌యుడు.?

Ajay Devgan: వరుసగా టాలీవుడ్ ముద్దగుమ్మలనే ఎంచుకుంటున్న బాలీవుడ్ స్టార్ హీరో..

Happy Birthday NBK: బాలయ్యకు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు.. ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన మెగాస్టార్- యంగ్ టైగర్