Nani : ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం రంగంలోకి దిగిన నేచురల్ స్టార్ నాని.. షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు..

తన నాచురల్ యక్టింగ్‌తో టాలీవుడ్లో స్టార్‌ హీరోగా దూసుకుపోతున్న నాని. ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో కనిపించనున్నారట. దానికోసం ఇప్పటికే రెడీ కూడా అయ్యారట.

Nani : ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ కోసం రంగంలోకి దిగిన నేచురల్ స్టార్ నాని.. షార్ట్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 6:45 PM

Nani

తన నాచురల్ యక్టింగ్‌తో టాలీవుడ్లో స్టార్‌ హీరోగా దూసుకుపోతున్న నాని. ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో కనిపించనున్నారట. దానికోసం ఇప్పటికే రెడీ కూడా అయ్యారట. ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది.  కరోనాకు ఎదురు నిలబడి పోరాడుతున్న వారియర్స్‌ను అభినందించేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉండనుందట. వారి సేవలను కొనియాడుతూ.. కరోనా నుంచి రక్షణ పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను మరో సారి నానితో చెప్పించనున్నారట ఈ షార్ట్ ఫిల్మ్ టీం. ఈ షార్ట్ ఫిల్మ్‌ను యూట్యూబ్‌ ఒరిజినల్స్‌లో రిలీజ్‌ చేయునున్నారట. ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ మాత్రం ప్రాణాలకు తెగించి పని చేస్తున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు చేస్తున్న సేవ వెలకట్టలేనిది. అయితే.. అలాంటి ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం ఏదో ఒకటి చేయాలని నాని నిర్ణయించుకున్నారు. ఇక ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇమ్మీడియట్ గా ఈ షార్ట్‌ ఫిల్మ్ షూట్ స్టార్ట్ అయ్యేలా చూడాలని అనుకుంటున్నారట. ఇక టక్‌ జదీష్ సినిమాను థియేటర్లో రిలీజ్‌ చేసేందుకు సిద్దం అయ్యారు నాని.

కరోనా పరిస్థితులు చక్కబడుతుండడం.. థియేర్లు జూలై నాటి కల్లా ఓపెన్ అయ్యేలా ఉండడంతో.. ఆగస్ట్లో ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు నాని అండ్ టీం ప్లాన్‌ చేస్తున్నారట. అందుకు కావాల్సిన పనులను డైరెక్టర్‌ శివ నిర్వాణ దగ్గరుండి మరీ చూసుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Parineeti Chopra: ఆ తప్పు మేకర్స్ దే అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. ఇక పై అలాంటి సినిమాలే చేస్తానంటున్న పరిణితి..

శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.

Kamal Haasan: కమల్ హాసన్ కు తప్పని కథానాయిక కష్టాలు.. లోకనాయకుడు ఆ హీరోయిన్ తో సినిమా చేయనన్నారా..?