Kamal Haasan: కమల్ హాసన్ కు తప్పని కథానాయిక కష్టాలు.. లోకనాయకుడు ఆ హీరోయిన్ తో సినిమా చేయనన్నారా..?

పొలిటికల్‌గా నిరాశపరిచిన కమల్‌ హాసన్‌కు.. సినిమాల్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు. పేరుకు మూడు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నా ఒక్కటి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితే లేదు.

Kamal Haasan: కమల్ హాసన్ కు తప్పని కథానాయిక కష్టాలు.. లోకనాయకుడు ఆ హీరోయిన్ తో సినిమా చేయనన్నారా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 10, 2021 | 6:27 PM

Kamal Haasan : పొలిటికల్‌గా నిరాశపరిచిన కమల్‌ హాసన్‌కు.. సినిమాల్లోనూ ఇబ్బందులు తప్పటం లేదు. పేరుకు మూడు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నా ఒక్కటి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితే లేదు. ప్రస్టీజియస్‌గా స్టార్ట్ చేసిన ఇండియన్‌ 2 షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. మళ్లీ మొదలవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. పోని ఆల్రెడీ మొదలు పెట్టిన విక్రమ్ అయినా కంటిన్యూ అవుతుందా అంటే అది కూడా అనుమానంగానే ఉంది. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి బిజీ ఆర్టిస్ట్‌లు నటిస్తుండంతో సెకండ్ వేవ్ తరువాత వాళ్ల డేట్స్ అడ్జస్ట్ చేయటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది.

సక్సెస్‌ ఫార్ములాను రిపీట్‌ చేస్తూ పాపనాశనం సీక్వెల్‌ను పట్టాలెక్కిద్దామన్న అది కూడా జరిగేలా లేదు. గౌతమితో సహజీవనంలో ఉన్న సమయంలో ఆమెతో కలిసి పాపనాశనం సినిమా చేశారు కమల్‌.. మలయాళం, తెలుగులో లాగే తమిళ్‌లోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే సీక్వెల్‌ కు వచ్చే సరికి పరిస్థితులు మారిపోయాయి. కమల్‌తో డిఫరెన్సెస్‌ రావటంతో గౌతమి ఆయనకు దూరమయ్యారు. సో ఈ పరిస్థితుల్లో వాళ్లు కలిసి నటించే ఛాన్సే లేదు. కథలో పాత్రలన్నింటికీ కంటిన్యూటి ఉన్న సీక్వెల్ కావటంతో మరో నటితో సీక్వెల్ ప్లాన్ చేయటం కూడా కష్టమే.. ఈ విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారట కమల్‌. ఇలా అన్ని సినిమాలు సమస్యల్లో పడటంతో అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sonu Sood : ఇలా అయితే ఎలా ..? సోనూసూద్ ను విలన్ గా చూపించడానికి టెన్షన్ పడుతున్న దర్శకులు..

Yuvraj Singh Balakrishna: బాల‌కృష్ణ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన యువ‌రాజ్ సింగ్‌.. బాల‌య్య‌తో దిగిన ఫొటోను..

సొంత గొంతునే నమ్ముకుంటున్న మలయాళ హీరో.. పుష్పలో ఓన్ డబ్బింగ్ చెప్పుకోనున్న ఫాహద్ ఫాజిల్