Attack On Police: ప‌టాన్‌చెరులో విచార‌ణ‌కోసం వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడికి దిగిన వ్యక్తులు.. అరెస్ట్ చేసిన‌..

Attack On Police: హైద‌రాబాద్ న‌గ‌ర శివారు సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులో కానిస్టేబుల్‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగారు. విచార‌ణలో భాగంగా నోవాపాన్ చౌర‌స్తాలో ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకోవ‌డానికి వెళ్లిన బాచుప‌ల్లి స్టేష‌న్ కానిస్టేబుల్ క‌న‌క‌య్యపై...

Attack On Police: ప‌టాన్‌చెరులో విచార‌ణ‌కోసం వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడికి దిగిన వ్యక్తులు.. అరెస్ట్ చేసిన‌..
Attack On Police
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 10, 2021 | 8:33 PM

Attack On Police: హైద‌రాబాద్ న‌గ‌ర శివారు సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులో కానిస్టేబుల్‌పై కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగారు. విచార‌ణలో భాగంగా నోవాపాన్ చౌర‌స్తాలో ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకోవ‌డానికి వెళ్లిన బాచుప‌ల్లి స్టేష‌న్ కానిస్టేబుల్ క‌న‌క‌య్యపై న‌లుగురు వ్య‌క్తులు దాడికి దిగారు. వివ‌రాల్లోకి వెళితే.. మారుతీ ప్ర‌సాద్ అనే వ్య‌క్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఇటీవ‌ల కొత్త ఇంటిని నిర్మించుకున్న ప్ర‌సాద్ ఇంటీరియర్ డిజైన్ చేయించ‌డం కోసం రూ. 5 ల‌క్ష‌ల‌కు దేవీలాల్ అనే వ్య‌క్తితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తొలుత కొంత మొత్తాన్ని ప్ర‌సాద్ అడ్వాన్స్‌గా దేవీలాల్‌కు అందించాడు. ఇక డ‌బ్బులు తీసుకున్న‌దేవీలాల్ ప‌ని ప్రారంభించ‌కుండా త‌ప్పించుకు తిరిగాడు. దీంతో ప్ర‌సాద్‌.. పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎంత వెతికినా దేవీలాల్ ఆచూకి దొర‌క‌లేదు దీంతో ప్ర‌సాద్ నేరుగా కానిస్టేబుల్ కనకయ్యను దేవీలాల్ ద‌గ్గర‌కు తీసుకెళ్లాడు. విచార‌ణ‌లో భాగంగా దేవీలాల్‌కు నోటీసు ఇచ్చి సంతకం చేయాలని కోరారు. అక్క‌డ ఉన్న దేవీలాల్ అనుచ‌రులు కానిస్టేబుల్‌పై దాడికి దిగారు. దీనంత‌టిని అక్క‌డే ఉన్న వ్యక్తిఫోన్‌లో రికార్డు చేశాడు. ఇక వారి నుంచి ఎలాగో త‌ప్పించుకున్న కానిస్టేబుల్ క‌న‌క‌య్య పటాన్ చెరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దేవీలాల్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read: సైనిక విమానం కూలి 12మంది మృతి.. యాంగూంన్ సమీపంలో ప్రమాదం.

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం

Income Tax: ప్రపంచంలో అపర కుబేరులు.. పన్నుల చెల్లింపులో పాపం నిరుపేదలు.. ఎవరో.. ఏమిటో..ఎలానో తెలుసుకోండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు