మయన్మార్ లో సైనిక విమానం కూలి 12 మంది మృతి.. .దుర్ఘటనపై విచారణకు ఆదేశం
మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ విమానం కూలిన ఘటనలో 12మంది దుర్మరణం చెందారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది...
మయన్మార్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ విమానం కూలిన ఘటనలో 12మంది దుర్మరణం చెందారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. న్యాపిడా నుంచి పైన్ ఓ -ఎల్విన్ పట్టణానికి వెళ్తుండగా జరిగిన ఈ విషాద ఘటనలో ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12మంది ప్రాణాలు కోల్పోయారు. పైన్ ఓ- ఎల్విన్ పట్టణంలోని కొత్త మఠం శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఆరుగురు మిలటరీ సిబ్బందితో పాటు ఇద్దరు బౌద్ధమత సన్యాసులు, ఆరుగురు భక్తులు ఉన్నారు. ఈ ఘటనలో ఓ బాలుడు సహా మిలటరీకి చెందిన మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడినట్టు మిలటరీకి చెందిన ఓ టీవీ చానల్ వెల్లడించింది.
యాంగూంన్ సమీపంలోని మండాలే సెంట్రల్ సిటీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం న్యాపిడా నుంచి ఈ నగర సెంట్రల్ రీజన్ లోని పియోన్ ఓ లోవిన్ టౌన్ కి విమానం వెళ్తోందని…మండాలే విమానాశ్రయానికి 400 కి.మీ. దూరంలో ఉండగా దీనికి కమ్యూనికేషన్ సంబంరంధాలు తెగిపోయాయని తెలుస్తోంది. ఇద్దరిని మాత్రం రక్షించి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించింది ఖచ్చితంగా తెలియదు.. ఈ ప్రమాదానికి సంబంధించి విమాన శకలాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. లోగడ మయన్మార్ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు బౌధ్జ సన్యాసులు పోరాటం జరపగా మరికొందరు మాత్రం మిలిటరీ ప్రభుత్వాన్ని సమర్థించడంతో వీరిలో చీలికలు ఎర్పడ్డాయి.
కొత్త సైనిక ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న బౌద్ధ సన్యాసులు ఎక్కువయ్యారు. కాగా ఈ దుర్ఘటనలో ఇద్దరు సీనియర్ బౌధ్జ సన్యాసులతో బాటు ఏడుగురు మరణించారని మరో పోలీసుఅధికారి ఒకరు చెప్పారు. అటు ఈ ప్రమాదంపై విచారణకు అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది..
మరిన్ని ఇక్కడ చూడండి: శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.