దొంగలుగా మారిన ఖాకీలు.. తనిఖీల పేరుతో దోపిడీలు.. నిజం తెలిసిన అధికారులు షాక్..

నిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించే నాలుగో సింహమే పోలీసు అన్నా డైలాగ్ గుర్తుందా.. కానీ ఇక్కడ పోలీసులు సింహాలు కాదు.. దొంగల్లా మారారు.

దొంగలుగా మారిన ఖాకీలు.. తనిఖీల పేరుతో దోపిడీలు.. నిజం తెలిసిన అధికారులు షాక్..
Fir Registered Against Thre
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 10, 2021 | 8:42 PM

చిన్న దొంగతనమైనా సరే.. దొంగలను చాకచక్యంగా పట్టుకోవాలి. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే.. కనిపించే నాలుగో సింహమే పోలీసు అన్నా డైలాగ్ గుర్తుందా.. కానీ ఇక్కడ పోలీసులు సింహాలు కాదు.. దొంగల్లా మారారు. తనిఖీల పేరుతో చేతికి అందినకాడికి దోచుకున్నారు. తమిళనాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్లూరు జిల్లా అరియూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఈ దోపిడీకి పాల్పడ్డారు. అరియూర్ సమీపంలోని నాచిమెడులో లాక్‌డౌన్ పర్యవేక్షణకు వచ్చిన పోలీసులు ఈ దోపిడీకి పాల్పడ్డారు.

ఇదే గ్రామంలో నాటు సార కాస్తున్నారనే సమాచారంతో ఓ ఇంటిపై దాడి చేసి.. తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో వారి ఇంట్లో దాచుకున్న నగదు, బంగారంను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా చేతికి దొరికిన నగదు, నగలను నొక్కేశారు. ఇది గమనించన పోలీసులు స్థానిక ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆ గ్రామస్థులు.జిల్లా పోలీస్ అధికారులు విచారణ చేపట్టారు. వారు చేసినది నిజమే అని తేలడంతో ఆ ముగ్గురిని సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: Congress Party: నా మృతదేహం కూడా బీజేపీలో చేర‌దు.. కాంగ్రెస్‌లో సమస్యలు అలాగే ఉన్నాయి..

Savings Accounts: ఈ బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై అందిస్తున్న వడ్డీ రేట్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!