Congress Party: నా మృతదేహం కూడా బీజేపీలో చేరదు.. కాంగ్రెస్‌లో సమస్యలు అలాగే ఉన్నాయి..
తాను బతికి ఉండగానే కాదు.. తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చాలా సీరియస్ కామెంట్ చేశారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్ళమని అంటూ వ్యాఖ్యానించారు.
తాను బతికి ఉండగానే కాదు.. తన మృతదేహం కూడా బీజేపీలో చేరదని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చాలా సీరియస్ కామెంట్ చేశారు. తాము నిజమైన కాంగ్రెస్ వాళ్ళమని అంటూ వ్యాఖ్యానించారు. తన జీవితంలో ఎప్పుడూ బీజేపీలో చేరాలని అనుకోలేదని…. ఒకవేళ, కాంగ్రెస్ నాయకత్వం.. ఒకవేళ తాము అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై కూడా సూటి మాటలను సందించారు. తనను పార్టీ వీడాలని కోరితే అప్పుడు దాని గురించి ఆలోచిస్తాన్నారు. అయితే బీజేపీలో మాత్రం చేరబోనని అంటూ మరోసారి తనదైన తరహాలో కామెంట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద్ బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో కపిల్ సిబల్ ఈ మేరకు గురువారం ఈ కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో గతేడాది తెరపైకి వచ్చిన నాయకత్వ సంక్షోభం ఆ తర్వాత చల్లబడింది. అయితే తాజాగా యూపీ కాంగ్రెస్ నేత జితిన్ ప్రసాద పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరడంతో మళ్లీ నాయకత్వ సంక్షోభంపై చర్చ మొదలైంది. జితిన్ ప్రసాద అలా బీజేపీ గూటికి చేరారో లేదో… అప్పుడే గతంలో నాయకత్వ సంక్షోభానికి కారణమైన నేతలు ఒక్కొక్కరిగా మీడియా ముందుకు రావడం మొదలు పెట్టారు.
కాంగ్రెస్‌లో తాజా సంక్షోభంపై స్పందించిన సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీ తమ వాదన వినడంలో విఫలమైతే తామంతా విఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్న సమస్యలు ఏమిటో తనకు ఖచ్చితంగా తెలుసని సిబల్ చెప్పుకొచ్చారు. తమ సమస్యలను పార్టీ నాయకత్వం వింటుందని తాను నమ్ముతున్నానని అంటున్నారు. చెప్పేది వినకుండానే ఎవరూ మనుగడ సాగించలేరని, కార్పొరేట్ నిర్మాణం కూడా దీనికి మినహాయింపు కాదన్నారు. మాట వినకపోతే ఎవరైనా చెడ్డ రోజులలో పడతారని కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు.