‘ప్రధాని మోదీ ఈ దేశ అత్యున్నత నేత’…….శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొత్త ‘గళం’ !

ప్రధాని మోదీ ఈ దేశానికి,, బీజేపీకి టాప్ లీడర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వానికి బీజేపీ రుణపడి ఉండాలని..ప్రస్తుతం ఈ దేశానికి, ఆ పార్టీకి కూడా మోదీ అగ్ర నాయకుడని సంజయ్ అన్నారు...

  • Updated On - 7:51 pm, Thu, 10 June 21 Edited By: Ravi Kiran
'ప్రధాని మోదీ ఈ దేశ అత్యున్నత నేత'.......శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కొత్త 'గళం' !
Pm Modi Is Great Leader Says Shivsena Leader Sanjay Raut

ప్రధాని మోదీ ఈ దేశానికి,, బీజేపీకి టాప్ లీడర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా నరేంద్ర మోదీ నాయకత్వానికి బీజేపీ రుణపడి ఉండాలని..ప్రస్తుతం ఈ దేశానికి, ఆ పార్టీకి కూడా మోదీ అగ్ర నాయకుడని సంజయ్ అన్నారు. మోదీ ఈ దేశానికంతటికీ చెందినవారని, కేవలం ఒక పార్టీకి మాత్రమే చెందినవారు కారని తమ పార్టీ భావిస్తోందన్నారు. ఈ కారణంగా రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో ఇన్వాల్వ్ కారాదని ఆయన పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్ ఎస్ ఎస్ యోచిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో మోదీ పాపులారిటీ తగ్గిందని మీరు భావిస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. అయితే ఈ వార్తలపై తాను స్పందించబోనని..అసలు ఇలాంటి విషయాలపై అధికారిక ప్రకటన లేదని సంజయ్ రౌత్ చెప్పారు. ప్రస్తుతం ఈయన జలగావ్ పర్యటనలో ఉన్నారు. మోదీ కోరితే శివసేన చిహ్నమైన ‘టైగర్’ (పులి) తో తమ పార్టీ ఫ్రెండ్ షిప్ చేస్తుందని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత పాటిల్ చేసిన వ్యాఖ్య గురించి ప్రస్తావించగా.. టైగర్ తో ఎవరూ మైత్రి చేయలేరని, కానీ టైగరే తనతో ఎవరు మిత్రులుగా ఉండాలో నిర్ణయించుకుంటుందని ఆయన అన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రధాని మోదీ తో సమావేశమైన నేపథ్యంలో సంజయ్ రౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

‘మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఢోకా లేదు..శరద్ పవార్ :

మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉంటుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. మిత్ర పక్షమైన శివసేనను ప్రశంసిస్తూ ఆయన,, ఆ పార్టీని ఎవరైనా నమ్మవచ్చునన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి 2024 లో జరిగే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. పవార్ గతవారం బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కూడా భేటీ అయిన విషయం గమనార్హం. ఉద్ధవ్….మోదీ ఈనెల 8 న ఢిల్లీలో ముఖాముఖిగా సమావేశమైన అనంతరం మొదట సంజయ్ రౌత్,, అనంతరం శరద్ పవార్ ఇలా వ్యాఖ్యానించడం విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: శ్రీ హరి మంచితనాన్ని.. గుప్తదానాలను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్న కమెడియన్ పృద్వి రాజ్ :PrudhviRaj video.

చీర కట్టులో గుర్రపు స్వారీ చేస్తున్న మోనాలిసా..నెట్టింట్లో వైరల్ గా మారిన వీడియో.: woman riding a horse video.

YS Jagan Delhi Tour Live Video : హస్తినకు సీఎం జగన్.. కొవిడ్‌ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం.

Warangal : వరంగల్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..రాత్రికి రాత్రే యువకుడు అదృశ్యం..వణికిపోతున్న స్థానికులు(వీడియో).