Rent Fat People: 100 కేజీల దాటి బరువున్న భారీ కాయులు అద్దెకు కావాలంటూ నోటిఫికేషన్ ఎక్కడంటే..
Rent Fat People: ఇల్లు కార్లు, వాహనాలు స్థలాలు అద్దెకు తీసుకోవడం అందరికీ తెలిసిందే.. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులతో మనుషులను కూడా అద్దెకు తెచ్చుకునే..
Rent Fat People: ఇల్లు కార్లు, వాహనాలు స్థలాలు అద్దెకు తీసుకోవడం అందరికీ తెలిసిందే.. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పులతో మనుషులను కూడా అద్దెకు తెచ్చుకునే స్టేజ్ కు చేరుకున్నాం. ఇదే విషయాన్ని బాలీవుడ్ లో 90 లో రుడాలి సినిమా తీశారు. మనుషులు మరణిస్తే.. ఆ పార్ధీవ దేహం వద్ద అద్దెకు తెచ్చుకున్న మనిషి ఏడుస్తుంది. ఇది నిజ జీవితంలో కూడా ఉంది.. ఓ దేశంలో మనుషులను అద్దెకు దొరుకుతారు. అక్కడ ఓదార్పునివ్వడానికి, కాసేపు బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్‌గా నటించడానికి, ఒకరికి తమ బదులు క్షమాపణ కోరడానికి ఇలా అనేక పనులకు అక్కడ అద్దెకు మనుషులు దొరుకుతారు. ఈ సారి ట్రెండ్ మార్చి సరికొత్తగా ఊబకాయులు అద్దెకు ఇవ్వడం మొదలు పెట్టారు.. ఇప్పటికే ఓ సంస్థ కూడా ఏర్పాటు అయ్యింది. మరి ఇంతకీ ఆదేశం ఏమిటో తెలుసా.. ఆసియా ఖండంలోని జపాన్.
ఇక్కడ మనుషులను అద్దె కు ఇవ్వడం కొత్తకాదు.. ఎప్పటినుంచో జరుగుతుందే.. తాజాగా భారీ శరీరం ఉన్నవారిని అద్దెకు ఇస్తున్నారు. నిజానికి అద్దెకు మనుషులను ఇచ్చే సంస్థల్లో అందంగా, ఆకర్షణీయంగా ఉండే వారికే డిమాండ్ ఉంటుంది. కానీ, ఇటీవల లావుగా ఉండే వారిని కూడా అద్దెకు ఇచ్చేందుకు ఓ సంస్థ ఏర్పాటైంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ సంస్థలో ఉద్యోగులుగా చేరారు.
2017లో బ్లిస్ అనే వ్యక్తి లావుగా ఉండే వారి కోసం ‘క్యూ జిల్లా’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించాడు. బ్రాండ్ ప్రకటనల కోసం లావుగా ఉండే మోడల్స్‌ను వెతికితే ఎవరూ దొరకలేదట. దీంతో తనకు లావుగా ఉండే మోడల్స్ కావాలని ఓ ప్రకటన ఇచ్చాడు. దీంతో తన కస్టమర్లలోనే చాలా మంది మోడలింగ్ చేస్తామని ముందుకొచ్చారు. అప్పుడు వీరికోసం టాలెంట్ హంట్ పేరుతో కార్యక్రమం నిర్వహించాడు. టాలెంట్ ఉన్నవాళ్లకు మోడల్స్‌గా అవకాశమిచ్చాడు.
అయితే అతనికి అందంగా ఉన్నవారినే కాదు భారీ శరీరం ఉన్నవారి అవసరం వస్తుంది.. ఉదాహరణకు శరీర బరువు తగ్గించే ఫిట్‌నెస్ సంస్థలు, డైట్ ప్లాన్ ఇచ్చే సంస్థలు వీరిని అద్దెకు తీసుకొని ప్రకటనలు రూపొందించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో అవసరాలను ఊహించే అలాంటి వారిని అద్దెకు ఇస్తే ఆలోచన వచ్చింది బ్లిస్ కు. వెంటనే ఆచరణలో పెట్టాడు. అలా పుట్టిందే.. ‘దెబుకారీ’ సంస్థ.
ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు గంటకు అద్దె తీసుకోవాలంటే 2000 జపాన్ యెన్లు(రూ.1,315) ఉంటుందట. ఇటీవల ఈ సంస్థ మరికొంత మందిని ఉద్యోగులకు జాయిన్ చేసుకోవడానికి ఓ ప్రక్కన కూడా రిలీజ్ చేసింది. ఎవరైనా అమ్మాయి, అబ్బాయి 100 కేజీలకు పైగా ఉంటె తమ సంస్థలో ఉద్యోగులుగా చేరవచ్చని ప్రకటించింది. అంతేకాదు. తమ సంస్థ నామ మాత్రపు ఫీజుతో పనిచేస్తుందని.. వచ్చిన అద్దె మొత్తం ఉద్యోగులకే ఇస్తామని చెప్పింది. ఇప్పటికే ఈ సంస్థ టోక్యో, ఒసాకా, అయిచీ వంటి నగరాల్లో తమ సేవల్ని అందిస్తోంది.
Also Read: ఆంధ్ర స్టైల్ లో కర్వేపాకు కారం పొడి తయారీ విధానం ఎలానో తెలుసుకుందాం l