AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Psychology: చేతులు ఫ్యాంట్‌ పాకెట్‌లో పెట్టి నడిచే అలవాటు మీకూఉందా? అయితే మీ వ్యక్తిత్వం ఇదే

చాలా మంది అబ్బాయిలు నలుగురిలో ప్రవర్తించే తీరు వారి మనస్తత్వాన్ని ఇట్టే చెప్పేస్తాయి. ముఖ్యంగా వారు రోడ్డుపై నడిచేటప్పుడు వారి చేతుల కదలికలు, చూసే విధానం, బాడీ లాంగ్వేజ్.. గమనించాలే గానీ వారితో పరిచయం లేకుండా వారెలాంటి వారో ఇట్టే చెప్పొచ్చు.. అలాంటి ఓ టెక్నిక్ ఇదీ..

Psychology: చేతులు ఫ్యాంట్‌ పాకెట్‌లో పెట్టి నడిచే అలవాటు మీకూఉందా? అయితే మీ వ్యక్తిత్వం ఇదే
Habit Of Walking With Hands In Pockets
Srilakshmi C
|

Updated on: Jan 19, 2025 | 1:07 PM

Share

సాధారణంగా జేబులో చేతులు పెట్టుకుని నడవడం మీరు చాలా మందిని చూసే ఉంటారు. ఇది సాధారణ విషయం మాత్రమే కాదు.. దీని వెనుక చాలా అర్థాలున్నాయంటున్నారు మానసిక నిపుణులు. ఈ ప్రవర్తన మనకు పెద్ద విషయంగా అనిపించకపోయినా మానసిక, భావోద్వేగ స్థితికి దీనిని ఓ సంకేతంగా గుర్తిస్తారట. అవును. మన ప్రతి కదలిక ఒక్కో సంకేతం పంపుతుంది. ఒక వ్యక్తి నడుస్తున్నప్పుడు వారి చేతులను కదుపుతున్న విధానం కూడా వారి అంతర్గత భావాలను ప్రతిబింబిస్తుంది. కొన్నిసార్లు వీటిని ఆయా వ్యక్తులు గమనించకపోవచ్చు. ఈ రకమైన కదలికలు, సంజ్ఞలు అనేక రకాల భావోద్వేగాలు , వైఖరులను ఎదుటి వారికి తెలియజేస్తుంటాయి. ఇంతకీ వాటర్ధం ఏమిటో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

పాకెట్స్‌లో చేతులు పెట్టుకుని నడిస్తే..

ఒక వ్యక్తి తన జేబులో చేతులు పెట్టుకుని నడిస్తే.. అతడే పరధ్యానం లేకుండా చాలా అలర్ట్‌గా ఉన్నాడని అర్ధం. ఇది ఒక రకంగా ఇతరుల నుంచి దాక్కోవడం లాంటిది. ఈ సంజ్ఞ ప్రత్యేకించి వ్యక్తి సామాజికంగా అసురక్షితంగా భావించినప్పుడు ఈ విధంగా చేతులు దాచుకుంటాడు. ఇలా చేయడం వల్ల భద్రతా భావం ఏర్పడుతుంది. అంటే మానసికంగా టెన్షన్‌ని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు చేసిన ప్రయత్నమే ఇదని అంటున్నారు నిపుణులు.

కొన్ని సందర్భాల్లో ఇది ఉదాసీనత, నిష్క్రియాత్మకతను కూడా సూచిస్తుంది. ఈ భంగిమ అర్ధాలు పూర్తిగా వ్యక్తిగతం. వ్యక్తి-వ్యక్తి పరస్పర చర్యను నివారించాలనే కోరిక కూడా కావచ్చు. ఉదాహరణకు.. ఎవరైనా చేతులను జేబులో పెట్టుకుని రద్దీగా ఉండే ప్రదేశంలో నడవడం మీరు గమనిస్తే.. ఆ వ్యక్తి దేనిలోనూ పాల్గొనకూడదని, అలాంటి విషయాల పట్ల ఉదాసీనతను ప్రదర్శిస్తున్నాడని అర్ధం చేసుకోవాలి. కొన్నిసార్లు ఈ భంగిమ ఒక వ్యక్తి తన వ్యక్తిగత సరిహద్దులను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే చేతులను జేబుల్లో ఉంచుకోవడం ఎల్లప్పుడూ అభద్రతను మాత్రమే సూచించదు. కొందరు వ్యక్తులు విశ్వాసాన్ని చూపించడానికి కూడా దీనిని ఉపయోగిస్తారు. ముఖ్యంగా నిటారుగా ఉన్న భంగిమతో, చురుకైనా చూపుతో నడవడం వలన ఎటువంటి భయం లేకుండా ఒక రకమైన రిలాక్స్డ్ ప్రవర్తనను ప్రదర్శిస్తున్నట్లు అర్ధం చేసుకోవాలి. కొన్నిసార్లు ఇది చాలా కాన్ఫిడెన్స్‌ను కూడా సూచిస్తుంది. ఈ విధంగా వివిధ రకాలైన నడకలు వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే.. ఎదురి వారి సంజ్ఞలు సరిగ్గా అర్థం చేసుకుని వారికి తగ్గట్టు మనం మసలుకోగలం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.