Footwear: మీరు షూ, చెప్పులు షాపింగ్ చేసేందుకు ఉదయం వేళ వెళ్తున్నారా? వెంటనే మానుకోండి.. ఎందుకంటే
కొంత మంది చెప్పులు కొనేందుకు ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ కు వెళ్తుంటారు. అలాగే అవసరం ఉన్నా లేకున్నా పదుల సంఖ్యలో చెప్పులు, షూ కొని ఇంటి నిండా నింపేస్తుంటారు. అయితే మీరు షాపింగ్ చేసే సమయంలో చేసే కొన్ని పొరబాట్లు మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jan 17, 2025 | 8:32 PM

మార్కెట్లోకి వచ్చే రంగురంగుల, ఆకర్షణీయమైన చెప్పులు, షూ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ చెప్పుల్లో చాలా వెరైటీలు ఉంటాయి. కొంతమంది తమ డ్రెస్సింగ్‌కు సరిపోయే చెప్పులను కొనుగోలు చేస్తారు. మరికొందరు అన్ని డ్రెస్సులపై ఒకే రకమైన బూట్లు, చెప్పులు కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటిని కొనే సమయంలో మనం చేసే కొన్ని పొరపాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా షూస్ కొనే సమయంలో ఈ పాయింట్లపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలట. అవేంటంటే..

ప్రతి ఒక్కరూ మన పాదాలకు సరిపోయేలా మాత్రమే ఫుట్ వేర్ కొనుగోలు చేయాలి. బూట్లు కొనుగోలు చేసేటప్పుడు పరిమాణం సరైనదిగా చూసుకోవాలి. పరిమాణంతో పాటు, లేసులు బలంగా ఉన్నాయా, షూ సౌకర్యవంతంగా ఉందా లేదా, పాదాలకు సరిపోతుందా అనే దానిపై శ్రద్ధ వహించాలి.

కొంతమంది బూట్లు కొంటూనే ఉంటారు. అంటే తమ దగ్గర షూస్ ఉన్నాకూడా మళ్లీమళ్లీ రకరకాల రంగుల్లో కొంటూనే ఉంటారు. అయితే షూ పాదాలకు సరిపోతుందా, షూ ఎంత అవసరమో ఆలోచించరు. కాబట్టి ఖరీదైన షూలు కొనే సమయంలో ఇవన్నీ ఆలోచించి, అవసరమైతేనే కొనడానికి మనసు పెట్టాలి.

అందరూ చేసే తప్పులలో ఒకటి వన్ లెగ్ టెస్ట్. మనలో చాలా మంది ఒక పాదానికి షూ వేసుకుని, అది సరిగ్గా ఉందో లేదో, సౌకర్యంగా ఉందో లేదో పరీక్షించి వెంటనే కొనుక్కుంటాం. కానీ ఒంటికాలిపై చెప్పులతో చూడటం సరికాదు. రెండు పాదాలు ఒకేలా ఉండవని గుర్తుంచుకోండి. ఒక పాదానికి సౌకర్యవంతంగా అనిపించే షూ మరొకదానిపై చాలా గట్టిగా లేదా చాలా వదులుగా ఉండవచ్చు. అందుకే రెండు పాదాలకు చెప్పులు వేసి చూసుకోవలి.

పాదరక్షలను కొనుగోలు చేసేటప్పుడు, నాణ్యత, ధర తక్కువగా ఉందనీ.. షూలు కళ్లకు ఆకర్షణీయంగా కనిపిస్తే ఆలోచించకుండా కొనుగోలు చేస్తారు. కానీ నాణ్యతపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం మర్చిపోకూడదు. ఫ్యాషన్‌లు సమయంతో పాటు మారుతూ ఉంటాయి. ప్రస్తుత ఫ్యాషన్ ప్రకారమే మీ పాదరక్షలను ఎంచుకోండి. అలాగే రోజువారీ దుస్తులకు అనువైన సౌకర్యవంతమైన బూట్లు ధరించడం మంచిది. మీరు బూట్లు కొనబోతున్నట్లయితే సాయంత్రం సమయాన్ని ఎంచుకోవడం మంచిది. ఎందుకంటే కొంతమందికి సాయంత్రం వేళ పాదాలు వాచి ఉంటాయి. చెప్పులు ఉదయం కొంటే, వాపు సమస్య ఉన్నవారు సాయంత్రం వేసుకోలేరు. కాబట్టి బూట్లు కొనడానికి సాయంత్రం ఉత్తమ సమయం.




