- Telugu News Photo Gallery Cinema photos Mahesh Babu and Venkatesh celebrate the success of blockbuster movie Sankranthiki Vasthunam together.
చిన్నోడితో పెద్దోడు సెలబ్రేషన్.. సంక్రాంతికి వస్తున్నాం టీమ్‌తో మహేష్ బాబు
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ సంక్రాంతకి వస్తున్నాం సినిమాతో మన ముందుకు వచ్చారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Updated on: Jan 17, 2025 | 9:44 PM

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిలది సూపర్ హిట్ కాంబినేషన్. గతంలో వీరి కాంబోలో ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ విజయ పరంపరను కొనసాగిస్తూ సంక్రాంతకి వస్తున్నాం సినిమాతో మన ముందుకు వచ్చారు.

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్ సక్సెస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. మహేష్ బాబుతో సంక్రాంతికి వస్తున్నాం టీమ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూసిన మహేష్ బాబు చిత్రయూనిట్ కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. చిత్రయూనిట్ మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ ఫొటోల్లో మహేష్ బాబు లుక్ వైరల్ గా మారింది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో దర్శకుడు అనిల్ రావిపూడి, వెంకటేష్, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరితో పాటు పలువురు పాల్గొన్నారు.




