ఆహాలో వైల్డ్ ఫైర్‌లాంటి డ్యాన్స్ షో..ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదంట!
బ్లాక్ బస్టర్ రియాలిటీ షోస్‌తో అలరిస్తున్న ఆహా, మరో బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేస్తోంది. సూపర్ హిట్ డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2ను సిద్ధం చేస్తోంది. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ సీజన్‌కు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ పేరుతో స్ట్రీమ్ కానుంది.
Updated on: Jan 17, 2025 | 7:47 PM

సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే టీజర్ రిలీజ్ చేసింది ఆహా టీమ్. మన హీరోలు, మన పండుగ అంటూ సంక్రాంతి బరిలో పోటి పడిన కథనాయకులు గెస్ట్‌లుగా వచ్చిన ఎపిసోడ్స్ క్లిప్స్‌తో ప్రోమో రిలీజ్ చేశారు. మోస్ట్ ఎంటర్‌టైనింగ్‌గా కట్ చేసిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాడివసల్ అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత కలైపులి ఎస్ థాను. చాలా రోజులుగా వాయిదా పడుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని చెప్పారు. సంక్రాంతి సందర్భంగా హీరో సూర్య, దర్శకుడు వెట్రిమారన్‌ను కలిసి నిర్మాత ఆ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

ఘాటీ మూవీ నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అనుష్క లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీలో తమిళ హీరో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నారు. దేశిరాజు పాత్రలో నటిస్తున్న విక్రమ్ లుక్‌ను రివీల్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసింది ఘాటీ టీమ్.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన డాకు మహారాజ్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఆఫ్టర్ రిలీజ్ ప్రమోషన్ స్పీడు పెంచిన మేకర్స్, తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు బాబీ దర్శకుడు.