Tirumala darshan: తిరుపతికి వెళ్లాలనుకుంటున్నారా..? ఐఆర్‌సీటీసీ అందిస్తున్న బెస్ట్ ప్యాకేజీ ఇదే..!
కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుపతిలో కొలువైన వెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రజలు పోటెత్తుతారు. నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారిని చూడటానికి వేలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. కలియుగ వైకుంఠంగా పూజలందుకుంటున్న తిరుపతికి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని భావిస్తారు. శ్రీనివాసుని దర్శించుకుని పులకించి పోతారు.
కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుపతిలో కొలువైన వెంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రజలు పోటెత్తుతారు. నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల శ్రీవారిని చూడటానికి వేలాదిమంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. కలియుగ వైకుంఠంగా పూజలందుకుంటున్న తిరుపతికి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని భావిస్తారు. శ్రీనివాసుని దర్శించుకుని పులకించి పోతారు. ఈ నేపథ్యంలో తిరుపతికి వెళ్లే భక్తులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) శుభవార్త చెప్పింది. తిరుమల దర్శన్ పేరుతో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీని ద్వారా తిరుపతితో పాటు మరో ఐదు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకోవచ్చు.
టూర్ ప్యాకేజీలు
ఐఆర్‌సీటీసీని భారత ప్రభుత్వం 1999లో ఏర్పాటు చేసింది. రైల్వేలో టిక్కెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలను అందించేందుకు ఈ సంస్థను ప్రారంభించింది. దీని ద్వారా దేశం నలుమూలలకూ అనేక టూర్ ప్యాకేజీలు అమలువుతున్నాయి. వీటిలో అనేక పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లే భక్తుల కోసం తిరుమల దర్శన్ అనే ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. కుటుంబ సభ్యులతో కలిసి, లేదా స్నేహితులతో తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర, ఇతర బుక్కింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
నాలుగు రోజుల టూర్
ఐఆర్‌సీటీసీ ప్రకటించిన తిరుమల దర్శన్ టూర్ ప్యాకేజీ నాలుగు రోజుల పాటు ఉంటుంది. ఏదైనా శుక్రవారం ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలి. దీని ద్వారా మూడు రాత్రులు, నాలుగు పగల్లు పర్యటించవచ్చు. యాత్ర విశాఖపట్నం నుంచి మొదలవుతుంది. తిరుమలతో పాటు కాణిపాకం, శ్రీపురం, తిరుచానూరు, శ్రీకాళహస్తిలను సందర్శించుకోవచ్చు. ప్యాకేజీ తీసుకునే వారు ఐఆర్‌సీటీసీటూరిజం.కమ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
ఖర్చు
తిరుమల దర్శన్ ప్యాకేజీ వివరాల్లోకి వెళితే.. త్రీ ఏసీ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీకి టిక్కెట్ తీసుకుంటే రూ.27,900, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.16,575, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.13,540గా నిర్ణయించారు. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లల కోసం ధరలు వేర్వేరుగా ఉంటాయి. పిల్లలకు బెడ్ తో అయితే రూ.9,950, బెడ్ తీసుకోకపోతే రూ.7,290 ఉంటుంది.
స్లీపర్ కోచ్
స్లీపర్ కోచ్ ప్యాకేజీకి సంబంధించి సింగిల్ ఆక్యుపెన్సీకి టికెట్ బుక్ చేసుకుంటే రూ.26,005, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,675, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.11,645 ఖర్చవుతుంది. పిల్లలకు బెడ్ తీసుకుంటే రూ.8,055, బెడ్ వద్దనుకుంటే రూ.5,390 చెల్లించాలి.