Tokophobia: యువతుల్లో పెరుగుతోన్న టోకోఫోబియా.. అసలేంటీ సమస్య.?

ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళల్లో సంతానోత్పత్తి తగ్గుతోంది. పిల్లలకు జన్మనివ్వడానికి మహిళలు ఆసక్తి చూపించడం తగ్గుతోందని గణంకాలు చెబుతున్నాయి. జీవితమంతా పిల్లలు లేకుండానే జీవించాలనే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పలు పరిశోధనల్లో ఇలాంటి సంచలన...

Tokophobia: యువతుల్లో పెరుగుతోన్న టోకోఫోబియా.. అసలేంటీ సమస్య.?
Tokophobia
Follow us

|

Updated on: Oct 01, 2024 | 8:41 PM

ప్రపంచంలోని చాలా దేశాల్లో మహిళల్లో సంతానోత్పత్తి తగ్గుతోంది. పిల్లలకు జన్మనివ్వడానికి మహిళలు ఆసక్తి చూపించడం తగ్గుతోందని గణంకాలు చెబుతున్నాయి. జీవితమంతా పిల్లలు లేకుండానే జీవించాలనే ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పలు పరిశోధనల్లో ఇలాంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే కొందరు వృత్తిపరమైన అంశాలు, వ్యక్తిగతంగా జీవితాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశంతో పిల్లలను వద్దనుకుంటే మరికొందరిలో మాత్రమే టోకోఫోబియా అనే సమస్య కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ టోకోఫోబియా.? దీనికి పిల్లలను కనకపోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. టోకోఫోబియా అనేది ఒక మానసిక సమస్య. దీని కారణంగా పిల్లలకు జన్మనివ్వడానికి మహిళలు ఆసక్తి చూపించడం తగ్గిస్తున్నారు.

గర్భం దాల్చడం, పిల్లలకు జన్మనివ్వడం వంటి అంశాల గురించి మహిళలు భయపడుతున్నారు. ఈ భయం స్త్రీల జీవతాలను అనేక విధాలుగా ప్రభావితం చేసేలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. టోకోఫోబియా అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఉదాహరణకు, గర్భం, డెలివరీ లేదా నవజాత శిశువుకు సంబంధించిన ఏదైనా చెడు అనుభవం ఈ ఫోబియాకు కారణం కావచ్చని అంటున్నారు.

అలాగే గర్భధారణ సమయంలో తలెత్తే మార్పులు, ఆరోగ్య ప్రమాదాల గురించి కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలు టోకోఫోబియాకు కారణమవుతున్నాయని అంటున్నారు. గర్భధారణ సమయంలో నొప్పి గురించి భయం, శరీరంలో మార్పులు, సామాజిక జీవితంలో వచ్చే మార్పులు సైతం ఈ ఫోబియాకు కారణవమవుతున్నాయని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

అయితే మానసిక నిపుణుల సూచనలు పాటించడం, వారి నుంచి కౌన్సెలింగ్‌ వంటి అంశాల ఆధారంగా ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. నిపుణులు సూచనలు, సరైన చికిత్స అందించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. క్రమంగా పెరుగుతోన్న ఈ సమస్యకు అవగాహన కల్పించడం ఒక్కటే పరిష్కారమని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక