AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Attack in Children: లేత వయసులోనే పిల్లలకు హార్ట్‌ ఎటాక్‌ ఎందుకు వస్తుందో తెలుసా? షాకింగ్ విషయాలు

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా నెలల పసికందు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఎప్పుడో వయసు మీదపడిన ఆరవై ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ ఎటాక్‌ అభం శుభం ఎరుగని పిల్లలపై కూడా దాడి చేస్తుంది. దీంతో పిల్లల్లో గుండెపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గతి తప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లేనని నిపుణులు..

Heart Attack in Children: లేత వయసులోనే పిల్లలకు హార్ట్‌ ఎటాక్‌ ఎందుకు వస్తుందో తెలుసా? షాకింగ్ విషయాలు
Heart Attack In Children
Srilakshmi C
|

Updated on: Oct 01, 2024 | 8:32 PM

Share

నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా నెలల పసికందు నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరూ హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలి పోతున్నారు. ఎప్పుడో వయసు మీదపడిన ఆరవై ఏళ్ల తర్వాత వచ్చే హార్ట్ ఎటాక్‌ అభం శుభం ఎరుగని పిల్లలపై కూడా దాడి చేస్తుంది. దీంతో పిల్లల్లో గుండెపోటు, గుండె జబ్బులు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం గతి తప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, కొన్ని రకాల ఒత్తిడి పిల్లల హృదయాలను ప్రమాదంలో పడేస్తుంది. దీనిని సమయానికి తెలుసుకోకపోతే, లేత వయస్సులోనే ప్రమాదం పెరుగుతుంది. చిన్న వయసులోనే పిల్లల్లో గుండెపోటు ఎందుకు వస్తుందో నిపుణుల మాటల్లో ఇక్కడ తెలుసుకుందాం..

కార్డియాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. నేటి కాలంలో పిల్లలు శారీరకంగా యాక్టివ్‌గా ఉండటం లేదని, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో పెంచబడుతున్నారని ఫిర్యాదు చేస్తున్నారు. ఇదే కాకుండా చదువుపై ఒత్తిడి కూడా నానాటికీ పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంచెం అజాగ్రత్తగా ఉన్నా పిల్లల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు ఆటలు ఆడటం పూర్తిగా మనేశారు. ఇళ్లలోనే కూర్చుని ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడుతూ కాలక్షేపం చేస్తుంటారు. దీంతో పిల్లల్లో శారీరక శ్రమ అనేది పూర్తిగా కనుమరుగైంది. అందువల్లనే పిల్లలు గుండెపోటుకు గురవుతున్నారు. పైగా పిల్లలు ఎక్కువగా కొవ్వు పదార్ధాలను ఇష్టపడుతుంటారు. ఇళ్లల్లో చాలా మంది తల్లులు కూడా పోషకాహారం చేయడానికి బదులుగా రెండు నిమిషాల్లో అల్పాహారం తయారు చేసి ఇస్తున్నారు. తద్వారా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. గుండెపోటు నుండి పిల్లలను రక్షించాలంటే ఏమి చేయాలంటే..

వంశ పారంపర్య చరిత్ర ఉంటే జాగ్రత్తగా ఉండాలి

ఇంట్లో ఎవరైనా గుండెపోటుతో బాధపడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అజాగ్రత్తగా ఉండటం మానుకోవాలి. చిన్నవయసులో నిర్లక్ష్యం వహించడం తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

ఊబకాయం పిల్లలను గుండెపోటుకు గురిచేస్తుంది

పిల్లల్లో గుండె జబ్బులకు స్థూలకాయమే ప్రధాన కారణమని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో స్థూలకాయం వల్ల శ్వాసకోశ సమస్యలు, మధుమేహం తదితర వ్యాధులు వస్తాయి. తల్లిదండ్రులు సరైన సమయంలో సీరియస్‌గా ఉండకపోతే సమస్యలు పెరుగుతాయి.

పిల్లలు గుండె జబ్బులతో బాధపడుతుంటే జాగ్రత్తలు తీసుకోవాలి

పిల్లలు ఏదైనా తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతుంటే, అటువంటి పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవడం అవసరమని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వైద్యుడిని సందర్శించి సలహాలు, మందులు తీసుకోవాలి. ఇటువంటి పిల్లల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదు.

చదువుపై ఒత్తిడి

నేటి పోటీ సమాజంలో విద్యపై అధిక ఒత్తిడి ఉంది. పిల్లలు అధిక ఒత్తిడి కారణంగా ఇంటి బయట ఎక్కువ సమయం గడపడం వల్ల చిన్న వయస్సులోనే అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇది గుండె ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన ప్రమాదాలను పెంచుతుంది.

పిల్లల గెండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచాలి?

పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి వారిని ఆరుబయట హాయిగా ఆడుకోనివ్వాలి. పిల్లల ఆహారంపై అధిక శ్రద్ధ వహించాలి. ఫాస్ట్ ఫుడ్ మానుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. చిన్న వయస్సులో మధుమేహం ఉందేమో ట్రాక్ చేయాలి. పిల్లల బీపీని చెక్ చేస్తూ ఉండాలి. పిల్లలు లావుగా ఉంటే, కొవ్వు కరగడానికి వ్యాయామ సహాయం తీసుకోవాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.