ప్రియుడి సూసైడ్‌ లైవ్‌ కాల్.. ‘గుడ్‌లక్‌’ చెప్పిన ప్రేయసి! ఆ తర్వాత జరిగిందిదే..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళతో ప్రేమ వ్యవహారంలో వివాదం తలెత్తడంతో రవి (27) అనే యువకుడు శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కి ముందు అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళతో చాలాసేపు చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాట్‌లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే రెండు వీడియోలు కూడా సదరు మహిళకు పంపాడు. ఒక వీడియోలో పురుగుల మందు..

ప్రియుడి సూసైడ్‌ లైవ్‌ కాల్.. 'గుడ్‌లక్‌' చెప్పిన ప్రేయసి! ఆ తర్వాత జరిగిందిదే..
Man Committed Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 01, 2024 | 6:15 PM

లక్నో, అక్టోబర్‌ 1: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ మహిళతో ప్రేమ వ్యవహారంలో వివాదం తలెత్తడంతో రవి (27) అనే యువకుడు శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కి ముందు అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మహిళతో చాలాసేపు చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. చాట్‌లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే రెండు వీడియోలు కూడా సదరు మహిళకు పంపాడు. ఒక వీడియోలో పురుగుల మందు తాగుతున్నట్లు, మరొక వీడియోలో ఉరి వేసుకుంటున్నట్లు వీడియోలను రికార్డు చేసి, అనంతరం ఆమె ఇన్‌స్టా ఖాతాకు సెండ్ చేశాడు. ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో సదరు యువకుడు అన్నంత పని చేశాడు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబీకులు గమనించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మరోవైపు బంధువులు రవి ప్రేమించిన మహిళ ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె తాళం వేసి అప్పటికే పరారైనట్లు గుర్తించారు.

అసలేం జరిగిందంటే..

మృతుడు హరీష్ అలియాస్‌ రవి ట్రాన్స్ యమునా కాలనీ ఫేజ్-2లో నివాసం ఉంటున్నాడు. అక్కడే తాజ్ మహల్ పార్కింగ్ లో పనిచేసేవాడు. రవికి ఫిరోజాబాద్‌కు చెందిన ప్రియాంకతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి రెండేళ్ల కుమారుడు, మూడు నెలల కుమార్తె ఉన్నారు. తండ్రి వినోద్ కుమార్ ఆరు నెలల క్రితం పక్షవాతానికి గురై మంచానికి పరిమితమయ్యాడు. అయితే రవికి స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై గతంలో గొడవలు జరిగాయి. రవి తీరుతో విసిగిన భార్య నాలుగు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. అతని గది ఇంటి మొదటి అంతస్తులో ఉంది. ఆదివారం ఉదయం 10 గంటలకు తల్లి టీ ఇచ్చేందుకు వెళ్లగా.. రవి గది లోపలి నుంచి లాక్‌ చేసుకుని ఉండటం, ఎంతకూ తలుపు తీయక పోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించగా.. అతడు ఉరి వేసుకుని కనిపించాడు. రవితో చనువుగా ఉంటున్న వివాహిత మహిళ వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరుడు బ్రజ్‌భాన్‌ ఆరోపించాడు.

కుటుంబసభ్యులు రవి మొబైల్‌ను పరిశీలించగా.. సదరు మహిళతో జరిపిన చాటింగ్‌ను గుర్తించారు. సంఘటన జరిగిన రోజు రాత్రి 12 గంటల నుంచి 1:40 గంటల వరకు వీరిద్దరూ చాట్‌ చేశారు. వీడియో కాల్ చేయమని అడిగాడు. ఆమె చేయలేదు. వాయిస్ కాల్స్‌లో ఇద్దరి మధ్య పలు సంభాషణలు జరిగాయి. ఈ క్రమంలో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని వీడియో కాల్‌ చేసి చెప్పాడు. అనంతరం ఓ గిన్నెలో పురుగుల మందు స్ప్రే పోస్తూ యువకుడు వీడియో తీసి, దీనిని ఆమె ఫోన్‌కు పంపించాడు. వీడియోచూసిన సదరు మహిళ నీకు ఏది కావాలంటే అది చేసుకో అని బదులిచ్చింది. అనంతరం పురుగుమందు తాగుతున్న వీడియోను పంపించారు. ఈసారి మహిళ నిర్లక్ష్యంగా రిప్లై ఇచ్చింది. అనంతరం ఉరి వేసుకుంటున్నట్లు వీడియో పంపించాడు. అయితే ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇవి కూడా చదవండి

తన కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నాడని ఆ మహిళకు తెలియగానే మాకు సమాచారం ఇచ్చి ఉంటే మేము ఎలాగోలా బ్రతికించుకునే వాళ్లం కదా అంటూ కుటుంబీకులు కన్నీరుమున్నీరవయ్యారు. రవి మృతి చెందినట్లు తెలియగానే.. సదరు మహిళ ఇంటికి తాళం వేసి పరారైంది. ప్రేమ వ్యవహారం కారణంగానే రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎత్మద్దౌలా తెలిపారు. దీనిపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే దాని ఆధారంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.