Sons Burnt Alive Mother: దారుణం.. వృద్ధురాలైన తల్లిని చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేసిన కుమారులు.. ఎక్కడంటే?

నవ మాసాలు మోసి కనిపెంచి, ప్రయోజకులకు చేసిన ఓ తల్లి పట్ల ఆమె ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేసి, అనంతరం ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తూ మంటల్లో కాలి మరణించింది. ఈ దారుణ ఘటన..

Sons Burnt Alive Mother: దారుణం.. వృద్ధురాలైన తల్లిని చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేసిన కుమారులు.. ఎక్కడంటే?
Sons Burnt Alive Mother
Follow us

|

Updated on: Sep 30, 2024 | 5:03 PM

అగర్తల, సెప్టెంబర్‌ 30: నవ మాసాలు మోసి కనిపెంచి, ప్రయోజకులకు చేసిన ఓ తల్లి పట్ల ఆమె ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేసి, అనంతరం ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఆ తల్లి ఆర్తనాదాలు చేస్తూ మంటల్లో కాలి మరణించింది. త్రిపురలోని చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

త్రిపురలోని ఖమర్‌బారిలో నివసించే ఇద్దరు వ్యక్తులు శనివారం రాత్రి 62 ఏళ్ల వయసున్న వృద్ధురాలైన తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే వృద్ధురాలు మంటల్లో మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడింది మృతురాలి సొంత కుమారులు కావడం విశేషం. పోలీసులు ఆమె ఇద్దరు కుమారులను అరెస్ట్‌ చేసి, స్టేషన్‌కు తరలించారు.

మృతురాలి భర్త ఏడాదిన్నర కిందట మరణించాడు. అప్పటి నుంచి తన ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరో కుమారుడు అగర్తలాలో ఉంటున్నట్లు తెలిపారు. కుమారులను అదుపులోకి తీసుకున్నామని, కుటుంబ కలహాలే ఈ దారుణ హత్యకు దారితీసి ఉంటాయని అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన చంపక్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమర్‌బారిలో శనివారం రాత్రి జరిగినట్లు వారు తెలిపారు. వారిని సోమవారం కోర్టులో హాజరు పరగా.. విచారణ కోసం పోలీసు రిమాండ్ కోరారు. దీంతో ఇద్దరు నిందితులను పోలీసులు జైలుకు తరలించారు. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో