Panther Attack: నరమాంస భక్షనకు అలవాటు పడిన చిరుత.. 11 రోజుల్లో ఏడుగురు మృతి! ఆ గ్రామాల్లో స్కూళ్లు మూత..

రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో నరమాంస భక్షనకు అలవాటు పడిన చిరుత వరుస దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే దీని దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ ఆలయ పూజారిపై దాడి చేసిన చిరుత తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతడు మృతి చెందాడు. గత 11 రోజుల వ్యవధిలో ఏకంగా..

Panther Attack: నరమాంస భక్షనకు అలవాటు పడిన చిరుత.. 11 రోజుల్లో ఏడుగురు మృతి! ఆ గ్రామాల్లో స్కూళ్లు మూత..
Udaipur Panther Attack
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 30, 2024 | 5:48 PM

ఉదయ్‌పూర్‌, సెప్టెంబర్‌ 30: రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లో నరమాంస భక్షనకు అలవాటు పడిన చిరుత వరుస దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే దీని దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ ఆలయ పూజారిపై దాడి చేసిన చిరుత తీవ్రంగా గాయపరిచింది. దీంతో అతడు మృతి చెందాడు. గత 11 రోజుల వ్యవధిలో ఏకంగా ఏడుగురు మరణించడంలో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే..

ఉదయ్‌పూర్‌లోని గోంగుడా గ్రామంలో గత కొంత కాలంగా నరమాంస భక్షనకు అలవాటుపడిన చిరుత వరుస దాడులకు పాల్పడుతోంది. ఆదివారం రాత్రి గ్రామంలోకి ప్రవేశించిన చిరుత.. ఓ ఆలయ పూజారిపై దాడి చేసింది. పూజారి మహరాజ్‌ విష్ణు గిరి ఆదివారం రాత్రి ఆలయంలో నిద్రిస్తున్న సమయంలో ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. చిరుత పూజారిని అడవిలోకి లాక్కెళ్లి దాడి చేసింది. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సోమవారం తెల్లవారు జామున పూజారి మృత దేహాన్ని అడవిలో కనుగొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాజా దాడితో గత 11 రోజుల్లో ఇది ఏడో మరణం కావడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

చిరుతపులి వరుస దాడుల నేపథ్యంలో పోలీసులు, అటవీశాఖ అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో ఉచ్చులు బిగించారు. గత కొన్ని రోజులుగా కొన్ని చిరుతలు పట్టుబడ్డాయి. మరోవైపు చిరుత వరుస దాడులతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే సమీప గ్రామాల్లోని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం తమ ఇళ్లను విడిచిపెట్టవద్దని, గుంపులుగా మాత్రమే బయటకు వెళ్లాలని స్థానికులకు అధికారులు హెచ్చరికలు జారీ జేశారు. ఈ మేరకు పోలీసులు సోషల్ మీడియా ద్వారా రాత్రిపూట ఇళ్ల నుండి బయటకు రావొద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లవల్సివస్తే తమతో ఆయుధాలు తీసుకెళ్లాలని గ్రామస్తులకు సూచించారు. అయితే అన్ని దాడుల్లో ఒకే జంతువు ప్రమేయం ఉందా లేదా వేర్వేరు జంతువులు దాడులు చేస్తున్నాయా అనేది అస్పష్టంగా ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకూ జరిగిన దాడుల్లో చిరుత కదలికలు, దాడి చేసిన విధానం ఒకే విధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా అడవిలో నుంచి పూజారి మృతదేహాన్ని పోలీసులు వెలికితీస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.