Flood Water: వరద నీటిలో పెరుగుతున్న ప్రాణాంతక బ్యాక్టీరియా.. కాళ్లు పోగొట్టుకుంటున్న ప్రజలు.. తస్మాత్ జాగ్రత్త

భారీ వర్షాల కారణంగా కురిసే నీరు పారుదలకు సరిపడా డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో ఇళ్ల ఆవరణ లోని నీరు బయటకు వెళ్ళడం కొంచెం కష్టంగా మారింది. దీంతో మురికి నీటిలోనే బతకాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలోని చాలా గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇటీవలి వార్తల ప్రకారం.. ఇలా నిల్వ ఉన్న నీరు చాలా ప్రమాదకరమైనదిగా రుజువు చేయబడింది. ఈ నిల్వ నీరు కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.

Flood Water: వరద నీటిలో పెరుగుతున్న ప్రాణాంతక బ్యాక్టీరియా.. కాళ్లు పోగొట్టుకుంటున్న ప్రజలు.. తస్మాత్ జాగ్రత్త
Rains In Ap
Follow us

|

Updated on: Oct 01, 2024 | 7:17 PM

ఈ ఏడాది వర్షాకాలంలో ఋతుపవనాల ప్రభావంతో దేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల నీటి ఎద్దడి అన్న మాటే మరుగున పడిపోయింది. అదే సమయంలో మురుగునీరు పేరుకుంది. దీంతో పరిసరాల్లో అపరిశుభ్రత మరింత పెరిగింది. అదే సమయంలో భారీ వర్షాల కారణంగా కురిసే నీరు పారుదలకు సరిపడా డ్రైనేజీ వ్యవస్థ లేదు. దీంతో ఇళ్ల ఆవరణ లోని నీరు బయటకు వెళ్ళడం కొంచెం కష్టంగా మారింది. దీంతో మురికి నీటిలోనే బతకాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలోని చాలా గ్రామాల పరిస్థితి ఇలాగే ఉంది. అయితే ఇటీవలి వార్తల ప్రకారం.. ఇలా నిల్వ ఉన్న నీరు చాలా ప్రమాదకరమైనదిగా రుజువు చేయబడింది. ఈ నిల్వ నీరు కారణంగా ప్రజలు తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలోని నెహ్రూనగర్‌లో 81 ఏళ్ల వృద్ధుడు నివసించేవాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వృద్ధుడి ఇంట్లోకి నీరు చేరింది. నీటి చాలా ఎక్కువగా ఉంది, మురుగు కాలువ నీరు కూడా ఇంటి ఆవరణలోకి ప్రవేశించింది. ఎప్పటిలాగే ఆ వృద్ధుడు ఈ నీటిలో నివసించవలసి వచ్చింది. ఇలా ప్రతి సంవత్సరం జరిగేదే కనుక పెద్దగా పట్టించుకోకుండా ఆ వృద్ధుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకంటే చుట్టుపక్కల చాలా ఇళ్ల పరిస్థితి సాధారణంగా ఇలాగే ఉంటుంది. ఇలాంటి పరిసరాల్లోనే జీవించవలసి ఉంటుంది కనుక.

మురికి నీటి వల్ల ఇన్ఫెక్షన్ సోకిన వృద్దుడు

ఇవి కూడా చదవండి

మురికి నీటిలో నివసించడంతో పాటు ఆ మురికి నీటిలోనే నడవడం వలన వృద్ధుడి పాదాల దురద సమస్యతో ఇబ్బంది పడడం మొదలు పెట్టాడు. దీంతో ఆ వృద్దుడిని స్థానిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. కాలులో పుండు ఉందని కాలు తీసేయాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు వృద్ధుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇన్ఫెక్షన్ సోకడంతో వృద్ధుడి కాలు తీసేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. ఆ వృద్ధుడికి శస్త్ర చికిత్స చేసి కాలును తొలగించారు. అయితే ఇలా శస్త్ర చికిత్స చేసిన కొద్ది రోజులకే మృతి చెందాడు. వరదల వల్ల ఇన్ఫెక్షన్ సోకడం, మురుగు నీటిలో ఉండడం వల్లే ఇలా జరిగిందని వృద్ధుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విజయవాడలో వరద నీటిలో చిక్కుకున్న యువకుడికి ఇన్ఫెక్షన్ సోకడంతో కాలు తీసేయాల్సిన పరిస్థితి ఎదురైంది.

నిపుణులు ఏమి చెప్పారంటే

మురుగునీరు, వరద నీటిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌ వస్తోందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల వర్షాల సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తవానికి, వర్షంలో కురిసే అధిక నీరుతో పాటు మురుగునీరు వరద నీటిలో కలుస్తుంది. ఇందులో అనేక రకాల ప్రాణాంతక బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టిరియా పాదాలలో ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతుంది. అటువంటి పరిస్థితిలో కాలు తీసెయ్యడం తప్ప వేరే చికిత్స ఉండదు. లేకపోతే ఈ ఇన్ఫెక్షన్‌ శరీరం అంతటా వ్యాపిస్తుంది.

శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి

అటువంటి పరిస్థితిలో ఎవరైనా సరే తమ పాదాలను ఎక్కువసేపు వర్షపు నీటిలో ఉంచవద్దు. మునిసిపల్ కార్పొరేషన్ కూడా అటువంటి ప్రదేశాలలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాట్లు చేయాలి. వర్షపు నీటిలో నడిచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లను మళ్ళీ శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత శుభ్రమైన గుడ్డతో తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..