World Music Day: సంగీతం ఒక బెస్ట్ మెడిసిన్.. మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

సంగీతం వినోద సాధనం మాత్రమే కాదు. సంగీతం చాలా లోతైన సామాజిక ప్రభావాన్ని చూపుతుంది. సంగీతం ప్రజలను ఒకరితో ఒకరిని కనెక్ట్ చేయడానికి పని చేస్తుంది. అదే సమయంలో ఇది వ్యక్తి మనస్సు, మెదడును శాంతపరచడానికి కూడా పనిచేస్తుంది. ఇది ఒకరి ఆలోచనలను వేరే పద్ధతిలో వ్యక్తీకరించడంలో కూడా సహాయపడుతుంది. సంగీతం వినడం మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.

World Music Day: సంగీతం ఒక బెస్ట్ మెడిసిన్.. మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
World Music Day 2024
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2024 | 6:00 PM

ప్రతి ఒక్కరూ సంగీతాన్ని వినడానికి ఇష్టపడతారు. శాస్త్రీయ, పాప్, రాక్, జానపద సంగీతంతో సహా అనేక రకాల సంగీతం ఉన్నాయి. ఇవి సొంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నాయి. విభిన్న భావోద్వేగాలను వ్యక్తపరుస్తాయి. శాస్త్రీయ సంగీతంలో గంభీరత, లోతు ఉన్నప్పటికీ, జానపద సంగీతం సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. అందుకనే వయసుతో సంబంధం లేకుండా రకరకాల సంగీతాలను వినడానికి ఇష్టపడతారు.

సంగీతం వినోద సాధనం మాత్రమే కాదు. సంగీతం చాలా లోతైన సామాజిక ప్రభావాన్ని చూపుతుంది. సంగీతం ప్రజలను ఒకరితో ఒకరిని కనెక్ట్ చేయడానికి పని చేస్తుంది. అదే సమయంలో ఇది వ్యక్తి మనస్సు, మెదడును శాంతపరచడానికి కూడా పనిచేస్తుంది. ఇది ఒకరి ఆలోచనలను వేరే పద్ధతిలో వ్యక్తీకరించడంలో కూడా సహాయపడుతుంది. సంగీతం వినడం మానసిక, శారీరక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. అందువల్ల సంగీతాన్ని చికిత్సగా ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. సంగీతం ఒక వ్యక్తి మెదడుపై కూడా చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మనసుకు ఆనందం, శాంతిని ఇస్తుంది.

ఒత్తిడిని నియంత్రించడం

సంగీతం వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ నుంచి ఉపశమనాన్ని అందించడంలో ఇది సహాయకరంగా ఉంటుంది. సంగీతం మనస్సును ప్రశాంతపరుస్తుంది. సానుకూల శక్తిని పొందుతున్న అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ధ్యానం కోసం సంగీతం

ఒత్తిడిని తగ్గించడంలో పాటు అతిగా ఆలోచించడంలో ధ్యానం సహాయపడుతుందని చెప్పబడింది. కనుక ప్రతి ఒక్కరూ రోజూ ధ్యానం చేయాలి. అయితే ప్రతి ఒక్కరూ నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేయలేరు. అటువంటి పరిస్థితిలో తేలికపాటి సంగీతాన్ని వింటారు. మనస్సుకి విశ్రాంతి ఇవ్వడానికి, ధ్యానం చేసే సమయంలో చాలా మంది సంగీతం వినడానికి ఇష్టపడతారు.

మానసిక స్థితిని మెరుగుపరిచే సంగీతం

బిజీ లైఫ్ స్టైల్, అనేక సమస్యల కారణంగా చాలా సార్లు వ్యక్తి మానసిక స్థితి సరిగా ఉండదు. అప్పుడు చిరాకుగా అనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో సంగీతం వినడం చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే సంగీతం వినడం వల్ల మనసు రిలాక్స్ అవడంతో పాటు సంతోషకరమైన హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు అలసటను తగ్గించడంలో కూడా సంగీతం సహాయపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..