AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Hanuman: రోజుకు మూడు రూపాల్లో దర్శనం ఇచ్చే హనుమంతుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం ఇదే..

ఆంజనేయ స్వామి చాలా అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. అవి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల లేదా మరేదైనా వార్తల్లో ఉన్నాయి. వీటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లో హనుమంతుడి ఆలయం ఉంది. అక్కడ హనుమంతుడి విగ్రహం మూడుసార్లు రూపాన్ని మార్చుకుంటుంది. ఈ ఆలయం దాని ప్రత్యేకత కారణంగా చాలా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకం? మధ్యప్రదేశ్‌లో ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

Lord Hanuman: రోజుకు మూడు రూపాల్లో దర్శనం ఇచ్చే హనుమంతుడు.. ప్రపంచంలో ఏకైక ఆలయం ఇదే..
Unique Hanuman Temple
Surya Kala
|

Updated on: Oct 01, 2024 | 6:38 PM

Share

మంగళవారం, శనివారాలు హనుమంతుడి పూజకు ప్రత్యేక రోజులుగా పరిగణించబడుతున్నాయి. ఈ రెండు రోజులు హనుమంతుడి ఆలయాల్లో భారీగా జనం పోటెత్తారు. అలాంటి ఆంజనేయ స్వామి చాలా అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేక హనుమంతుడి ఆలయాలు ఉన్నాయి. అవి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల లేదా మరేదైనా వార్తల్లో ఉన్నాయి. వీటిలో ఒకటి మధ్యప్రదేశ్‌లో హనుమంతుడి ఆలయం ఉంది. అక్కడ హనుమంతుడి విగ్రహం మూడుసార్లు రూపాన్ని మార్చుకుంటుంది. ఈ ఆలయం దాని ప్రత్యేకత కారణంగా చాలా ఖ్యాతిగాంచింది. ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకం? మధ్యప్రదేశ్‌లో ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఈ ఆలయం గురించి చెప్పాలంటే..మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది చుట్టూ ఉన్న పూర్వ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయం హనుమంతుడికి సంబంధించిన పురాతన దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్న హనుమంతుడి విగ్రహం రోజులోని 24 గంటల్లో మూడుసార్లు రంగును మార్చుకుంటుంది. ఈ విగ్రహం ప్రపంచంలోనే అరుదైన విగ్రహాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ హనుమంతుడు నివాసం ఉంటాడని నమ్మకం. ఈ విగ్రహంలో భగవంతుని ముఖం చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. విగ్రహం సజీవంగా కనిపిస్తుంది.

రూపాన్ని 3 సార్లు మార్చుకునే విగ్రహం

ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే.. రోజులో మూడు సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది. ఆలయ పూజారులు చెప్పిన ప్రకారం ఈ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమంతుడి బాల రూపాన్ని చూడవచ్చు. దీని తరువాత మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బజరంగబలి యవ్వన రూపంలో కనిపిస్తాడు. బజరంగ్ బలి విగ్రహం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వృద్ధాప్యంలో ఉంటుంది. ఇలాంటి అద్భుతం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అందువల్ల ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

బజరంగబలి కీర్తనలు

బజరంగబలికి సంబంధించిన అన్ని విగ్రహాలు ఎక్కువగా ఎరుపు రంగులో కనిపిస్తాయి. ఇందులో హనుమంతుడి ఒక చేతిలో పర్వతం పట్టుకున్నట్లు ఉంటే.. మరొకటి చేతిలో గద్ద పట్టుకుని కనిపిస్తారు. చాలా విగ్రహాలలో సీతా రాముల దగ్గర కుర్చుని ఉన్నట్లు దర్శనం ఇస్తాడు. అయితే మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే అందులో ఆయన ఒక చేతిలో గద పట్టుకుని మరో చేత్తో రుద్రాక్ష జపమాలని ధరించి జపిస్తూ కనిపిస్తారు. ఈ విగ్రహంలో రుద్రాక్ష జపమాల హనుమంతుడి ఛాతీకి జోడించబడి ఉంటుంది. ఇక్కడ పండితుల అభిప్రాయం ప్రకారం అటువంటి విగ్రహం మరెక్కడా లేదు లేదా ప్రపంచంలోని ఏ హస్తకళాకారుడు తయారు చేయలేడు. ఇది ఒక ప్రత్యేకమైన విగ్రహం.. ఇక్కడ హనుమంతుడు నివాసం ఉంటాడని విశ్వసిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి