AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walking With Barefoot: వారెవ్వా.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

చెప్పులు లేకుండా నడవటం ప్రకృతితో మమేకం అవ్వటానికి సహాయపడుతుంది. దీంతో శరీరాన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే, వ్యాధుల నుండి సురక్షితంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకటేసారి కఠినమైన నేలపై చెప్పులు లేకుండా నడవటం ఈజీ కాదు. కాబట్టి మొదట మెత్తని గడ్డిపై నడవటానికి ప్రయత్నించాలి.

Walking With Barefoot: వారెవ్వా.. చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Walking With Barefoot
Jyothi Gadda
|

Updated on: Jun 19, 2024 | 6:31 PM

Share

వాకింగ్‌, జాగింగ్ ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. కానీ చెప్పులు లేకుండా నడవడం వల్ల లాభామా..? నష్టమా అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? కానీ, ఉదయాన్నే పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడవాలని పెద్దలు చెబుతుంటారు. వైద్యులు సైతం ఇదే సూచిస్తున్నారు. అయితే గడ్డిపై మాత్రమే కాకుండా ఏదైనా ఉపరితలంపై కూడకా చెప్పులు లేకుండా నడవడం ప్రయోజనకరమని మీకు తెలుసా.? షూస్‌తో నడవడం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. కానీ, చెప్పులు లేకుండా నడవడం వల్ల కీళ్లకు బలం చేకూరుతుంది. అంతేకాదు.. చెప్పులు లేకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచి నిద్ర కోసం మేలు చేస్తుంది: చెప్పులు లేకుండా నడవడం రాత్రిపూట మంచి నిద్రకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన శరీరంలోని కార్టిసాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. ఇది కాకుండా, చెప్పులు లేకుండా నడవడం కూడా స్లిమ్‌ అవడానికి కారణంగా మారుతుంది. అలాగే, పాదాల నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఎందుకంటే చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమి నుండి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీని వల్ల మన ఒత్తిడి తగ్గుతుంది. నిద్రబాగా పడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ప్రజలు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి అనేక మందులు, సప్లిమెంట్లను తీసుకుంటారు. అయితే కేవలం చెప్పులు లేకుండా నడవడం ద్వారా, శరీరం రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. చెప్పులు లేకుండా నడవడం వల్ల శరీరంలోని తెల్లకణాలు పెరుగుతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

వృద్ధులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది: వృద్ధులు తరచుగా వారి పాదాలలో నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి పరిస్థితిలో చెప్పులు లేకుండా నడవడం వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి, చెప్పులు లేకుండా నడవడం అనేది వృద్ధులకు ఆక్యుపంక్చర్ లాగా పనిచేస్తుంది. ఇది వారి పాదాల వాపు, నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది కాకుండా, కండరాల నొప్పి, కీళ్ల నొప్పులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

రక్త ప్రసరణకు ఉత్తమం: చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల్లో ఒకటి, ఇది శరీర రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీంతో శరీరాన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే, వ్యాధుల నుండి సురక్షితంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

చెప్పులు లేకుండా నడవటం ప్రకృతితో మమేకం అవ్వటానికి సహాయపడుతుంది. దీంతో శరీరాన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకోవచ్చు.శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటే, వ్యాధుల నుండి సురక్షితంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకటేసారి కఠినమైన నేలపై చెప్పులు లేకుండా నడవటం ఈజీ కాదు. కాబట్టి మొదట మెత్తని గడ్డిపై నడవటానికి ప్రయత్నించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా