AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మానసిక ప్రశాంతత కరువైందా? అయితే మీ ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినట్లే..

నేటి జీవనశైలి కారణంగా మానసిక ప్రశాంతత వేగంగా క్షీణిస్తుంది. కానీ చాలామందికి ఇది ఆరోగ్య సమస్యగా అనిపించదు. మానసిక, శారీరక ఆరోగ్యం ఈ రెండింటినీ సమతుల్యం చేయడంలో విటమిన్ బి 12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ శరీరంలో నిల్వ ఉండదు..

మానసిక ప్రశాంతత కరువైందా? అయితే మీ ఒంట్లో ఈ విటమిన్‌ లోపించినట్లే..
Vitamin B12 Deficiency
Srilakshmi C
|

Updated on: Aug 14, 2025 | 11:57 PM

Share

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ స్ట్రెస్‌, ఆందోళనతో చిత్తవుతున్నారు. మానసిక ప్రశాంతత వేగంగా క్షీణిస్తుంది. కానీ చాలామందికి ఇది ఆరోగ్య సమస్యగా అనిపించదు. మానసిక, శారీరక ఆరోగ్యం ఈ రెండింటినీ సమతుల్యం చేయడంలో విటమిన్ బి 12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ శరీరంలో నిల్వ ఉండదు. దీనిని రోజువారీ ఆహారం ద్వారా మాత్రమే ఎప్పటికప్పుడు పొందాల్సి ఉంటుంది. ఈ విటమిన్ అలసటను తగ్గించడంలో, మెదడు పనితీరును మెరుగుపరచడంలో, మానసిక స్థితిని స్థిరీకరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. NCBI నిర్వహించిన సర్వే ప్రకారం.. మన దేశంలో దాదాపు 70% మంది విటమిన్‌ 12 లోపంతో బాధపడుతున్నారు. కాబట్టి విటమిన్ బి 12 ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

మెదడు ఆరోగ్యానికి మంచిది

మెదడులోని నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో విటమిన్ బి12 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది చిరాకు, ఒత్తిడి, నిరాశ వంటి భావోద్వేగ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. ఇది మానసిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది.

గుండెను రక్షిస్తుంది

ఇది గుండె జబ్బులకు కారణమయ్యే హోమోసిస్టీన్ అనే ప్రమాదకరమైన పదార్ధం స్థాయిలను తగ్గిస్తుంది. అందువలన ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఎముకలను బలోపేతం చేయడానికి

శరీరంలోని ఆరోగ్యకరమైన ఎముకలకు విటమిన్ బి12 చాలా అవసరం. ఇది ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా ముఖ్యమైన పోషకం.

గర్భధారణ సమయంలో శిశువు పెరుగుదలకు ఎంతో కీలకం

గర్భస్థ శిశువు మెదడు, నరాల అభివృద్ధికి B12 చాలా అవసరం. గర్భధారణ సమయంలో B12 విటమిన్లు తీసుకోవడం వల్ల ప్రసవం అనంతరం శిశువులో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

అలసట నుంచి ఉపశమనం

బి12 లోపం వల్ల ఏ పని చేయకుండానే శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అందువల్ల, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి విటమిన్ బి12 అవసరం. అంతే కాదు ఇది శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది.

కంటి ఆరోగ్యానికి మేలు

వయసు పెరిగే కొద్దీ దృష్టి క్షీణిస్తుంది. కానీ B12 కంటి సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. కాబట్టి మంచి కంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి, శరీరంలో విటమిన్ B12 లోపం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

జీవక్రియను మెరుగుపరుస్తుంది

ఈ విటమిన్ శరీరంలో జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా జీర్ణక్రియ బాగా జరుగుతుంది. బరువు నియంత్రించడంలో సహాయపడుతుంది.

చర్మం, జుట్టు, గోళ్ల ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది

చర్మం ఆరోగ్యం క్షీణించడం, జుట్టు బలహీనంగా మారడం, రాలిపోవడం, గోళ్లు నల్లబడటం ఇవన్నీ బి12 లోపం వల్ల సంభవించే సమస్యలు. అందుకే ఇది సమృద్ధిగా లభించే ఆహారాలను రోజూ తీసుకోవాలి. విటమిన్‌ బి12 శరీరంలో కొత్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.