అత్తను చంపి 19 ముక్కలుగా చేసిన డాక్టర్ అల్లుడు.. ఎక్కడంటే?
పిల్లనిచ్చి కట్టబెట్టిన అత్తనే అతి కిరాతకంగా హతమార్చాడో అల్లుడు. అత్తను చంపి 19 ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత తలతో సహా ఇతర శరీర భాగాలను 14 ప్లాస్టిక్ కవర్లలో కుక్కి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లలో మానవ శరీర భాగాలు కనిపించిన కేసులో ఈ మేరకు మిస్టరీ వీడింది..

తుమకూరు, ఆగస్టు 9: ఓ డాక్టర్ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. పిల్లనిచ్చి కట్టబెట్టిన అత్తనే అతి కిరాతకంగా హతమార్చాడు. అత్తను చంపి 19 ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత తలతో సహా ఇతర శరీర భాగాలను 14 ప్లాస్టిక్ కవర్లలో కుక్కి రోడ్డు పక్కన పడేసినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లలో మానవ శరీర భాగాలు కనిపించిన కేసులో ఈ మేరకు మిస్టరీ వీడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా కొరటగెరె పోలీస్‌స్టేషన్ పరధిలోని కోలాల గ్రామంలో జరిగింది. వివరాల్లోకెళ్తే..
కర్ణాటకలోని కోలాల గ్రామంలో ఆగస్టు 7న రోడ్డు వెంట ఏడు ప్లాస్టిక్ కవర్లలో ఓ మహిళ శరీర అవయవాలు గుర్తు తెలియని వ్యక్తి పడేశాడు. అందులో ఓ కవర్‌లోని చేతి భాగాన్ని ఓ కుక్క నోట కరచుకుని రోడ్డుపై వెళ్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాసచారం అందించారు. వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు ఆ ఏడు కవర్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. తనిఖీ చేయగా మరో ఏడు కవర్లలో పాక్షికంగా కుళ్ళిపోయిన స్థితిలో మహిళ శరీర భాగాలు కనిపించాయి.
ఓ చోట తల భాగం లభ్యమవడంతో మృతురాలు కోలాల గ్రామానికే చెందిన లక్ష్మీదేవి (42)గా పోలీసులు గుర్తించారు. ఆమె అల్లుడు (ఆమె కూతురు భర్త) డెంటల్ డాక్టర్ రామచంద్రప్ప హత్యచేసినట్లు పోలీసులు గుర్తించారు. అత్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో తెలిసిన వాళ్ల సూటిపోటి మాటలు భరించలేక పోయాడు. ఎంత చెప్పినా అత్త తన తీరు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన డాకర్ట్ అల్లుడు రామచంద్రప్ప అవమానంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకు తన స్నేహితులైన కేఎన్ సతీశ్, కేఎస్ కిరణ్‌ల సాయం తీసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు లక్ష్మీ దేవిని హత్య చేసి, సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో మృతదేహాన్ని ముక్కలుగా కోసి, ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి, వివిధ ప్రదేశాలలో పారవేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




