AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.! మొదటి భార్యతో మాట్లాడినందుకు.. ఏకంగా భర్త ప్రైవేట్ పార్టునే..

ఉత్తరప్రదేశ్‌లోని అమేథిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అతడి ప్రాణల మీదికి తెచ్చింది. మొదటి పెళ్లి విషయం దాచి రెండో పెళ్లి చేసుకోవడం రెండో భార్యకు నచ్చలేదు. దీంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. దాంతో భర్త ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు.

వామ్మో.! మొదటి భార్యతో మాట్లాడినందుకు.. ఏకంగా భర్త ప్రైవేట్ పార్టునే..
Second Wife Chops Off Husband
Krishna S
|

Updated on: Aug 12, 2025 | 8:21 AM

Share

ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి అంటేనే ఆమడదూరంగా పరిగెడుతున్నారు. సింగిల్ లైఫ్ సో బెటర్ అనే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. మరికొంతమంది మాత్రం రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ పెళ్లికాని వారికి షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అతడి ప్రాణం మీదికి తెచ్చింది. తన భర్త మొదటి భార్యతో మాట్లాడటం నచ్చని రెండో భార్య, అతనికి ఆహారంలో మత్తుమందు కలిపి తీవ్రంగా దాడి చేసింది. అతడి ప్రైవేట్ పార్ట్‌ను కత్తితో కోసింది. తీవ్ర గాయాలైన భర్త..ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఈ ఘటనకు పాల్పడిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు.

జగదీష్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మగల్‌గంజ్ గ్రామానికి చెందిన అన్సార్ అలీ 2011లోవివాహం చేసుకున్నాడు. మార్చి 2025లో తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఇద్దరీ భార్యలకు తెలియడంతో ఇంట్లో తరచుగా గొడవలు జరిగేవి. దీంతో అన్సార్ తన రెండో భార్యతో కలిసి గ్రామంలో మరో ఇంట్లో నివసించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ రెండో భార్య నజ్ని బానో మొదటి భార్యతో అతను మాట్లాడడం, సంబంధం కొనసాగించడంపై కోపంగా ఉండేది.

ఈ నేపథ్యంలో అన్సార్ అలీ తన మొదటి భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ.. తాను రెండో పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఈ విషయం విన్న నజ్ని బానో కోపం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలో ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. తన భర్త ఆహారంలో మత్తుమందు కలిపింది. అన్సార్ గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత, అతనిపై కత్తితో దాడి చేసి పురుషాంగాన్ని కోసేసింది. ఆ తర్వాత అతడిని పలుసార్లు పొడిచింది. అనంతరం ఇంట్లో నుండి పారిపోయింది. అన్సార్ అరుపులు విని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నజ్ని బానోను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..