Tollywood: అసిస్టెంట్ కెమెరా ఉమెన్ ఆపై స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీస్
ఈ స్టార్ హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో ఎంతో మంది సినిమాటోగ్రాఫర్ల దగ్గర అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేసింది. మహిళనే అయినా కెమెరా ట్రాలీలు తోలుతూ ఎంతో కష్టపడింది. ఈ క్రమంలోనే ఆమె కష్టంతో పాటు ఆమె అందాన్ని మెచ్చిన దర్శకులు కెమెరా వెనుక కాదు కెమెరా ముందు నిల్చునే అవకాశం కల్పించారు

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న చాలా మంది కెరీర్ ప్రారంభంలో చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. పై ఫొటోలో కనిపిస్తోన్నఅమ్మాయి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేసింది. ఎంతోమంది సినిమాటోగ్రాఫర్ల దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసింది. మహిళనే అయినా కెమెరా ట్రాలీలు తోసుకుంటూ తన పనిని సమర్థంగా, నిబద్ధతతో నిర్వహించింది. రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాలకు అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె కష్టంతో పాటు ఆమె అందాన్ని మెచ్చిన దర్శకులు కెమెరా వెనుక కాదు కెమెరా ముందు నిల్చోవాలని ఆమెకు సలహా ఇచ్చారు. అలా హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఒక్క తెలుగులోనే కాదు దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సొంతం చేసుకుంది.
ఇంతకీ ఆ అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేసిన ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు అందాల తార, సహజ నటి సుహాసిని. తెలుగు, తమిళ్ భాషల్లో వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సుహాసిని ఇప్పుడు సహాయక నటిగా మెప్పిస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లకు అమ్మగా, అత్తమ్మ పాత్రలలో ఆకట్టుకుంటోంది. కాగా హీరోయిన్ కాకముందు కెమెరా అసిస్టెంట్ గా పనిచేసింది సుహసిని. సుమారుగా ఏడు చిత్రాల వరకు ఆమె కెమెరా అసిస్టెంట్ గా వర్క్ చేసింది. దిగ్గజాలుగా గుర్తింపు పొందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అశోక్ కుమార్ (Ashok Kumar), ఎన్.కె విశ్వనాథన్ తదితరుల వద్ద అసిస్టెంట్ గా పలు సినిమాలకు పనిచేసింది సుహాసిని. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కూడా ఉండడం విశేషం.
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో కెమెరా అసిస్టెంట్ గా సుహాసిని..
View this post on Instagram
లెజెండరీ సింగర్ జానకమ్మతో సుహాసిని..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




