Heavy Rain Alert: తెల్లవారుజాము నుంచే దంచికొడుతున్న వాన.. వచ్చే 2 రోజులు అతి భారీ వర్షాలు! బయటకు రావొద్దంటూ హెచ్చరికలు
గత వారం రోజులుగా భారీ వర్షాలు నగరాన్ని గజగజలాడిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మళ్లీ జంట నగరాలు తడిసిముద్దయ్యాయి. రానున్న మరో ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది..

హైదరాబాద్, ఆగస్టు 8: జంట నగరాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. వరుస వానలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా భారీ వర్షాలు నగరాన్ని గజగజలాడిస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం మళ్లీ జంట నగరాలు తడిసిముద్దయ్యాయి. రానున్న మరో ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. ఆగస్ట్ 13న మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఆగస్ట్ 13,14 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సోమవారం హైదరాబాద్‌తో సహా ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హయత్‌నగర్ పరిధిలో భారీ వర్షపాతం రికార్డయ్యింది. దీంతో భారీ వర్షాల నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాగల 24గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, సాయంత్రం వేళల్లో నగర వాసులు అప్రమత్తగా ఉండాలి, వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. వాహనదారులు సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా తదనుకుణంగా ఏర్పాట్లు చేసుకోవాలనిసైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, వర్షం కురిసే సమయంలో బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వివరించింది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న హెచ్చరించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, మాన్సూన్, డీఆర్‌డీఎఫ్, పోలీస్ సిబ్బందికి ముందస్తు హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




