AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌..! బియ్యం పంపిణీ ఎప్పుడంటే?

సెప్టెంబర్ నుండి రేషన్ కార్డు దారులకు బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా బియ్యం అందించబడుతుంది. జూన్‌లో మూడు నెలల బియ్యం పంపిణీ చేయబడినందున జూలై, ఆగస్టు నెలల్లో పంపిణీ లేదు. 96,060 కొత్త కార్డులు జోడించబడ్డాయి.

కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌..! బియ్యం పంపిణీ ఎప్పుడంటే?
New Ration Card
SN Pasha
|

Updated on: Aug 12, 2025 | 7:59 AM

Share

వచ్చే నెల అంటే సెప్టెంబర్​ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయనున్నారు. కొత్తగా రేషన్‌ కార్డులు వచ్చిన వారికి కూడా బియ్యం అందజేయనున్నారు. ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ​ఇప్పటికే తన కోటా మంజూరు చేసింది. రాష్ర్ట ప్రభుత్వం కూడా త్వరలో కోటా మంజూరు చేయనుంది. ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని జూన్‌లో ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో బియ్యం ఇవ్వలేదు. మూడు నెలలు ముగియడంతో ఇక సెప్టెంబర్‌ నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు. అయితే ఈ సారి కొత్త రేషన్​ కార్డులతోపాటు పాత రేషన్​ కార్డుల్లో కొత్తగా మెంబర్లుగా యాడ్ అయిన వారికి కూడా బియ్యం పంపిణీ చేయనున్నారు.

96,060 కొత్త కార్డులకు బియ్యం..

ప్రతినెలా డైనమిక్ కీ రిజిస్ట్రర్​(డీకేఆర్) జనరేట్ చేస్తారు. ఈ రిజిస్ట్రర్‌ జనరేట్ చేసే సమయానికి ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులకు బియ్యం కోటా అలాట్ చేస్తారు. ఏప్రిల్​ 25న డైనమిక్ కీ రిజిస్టర్ ​జనరేట్ ​చేసిన నాటికి పెరిగిన రేషన్​ కార్డులకు, యాడ్ అయిన మెంబర్లకు మూడు నెలల బియ్యం పంపిణీ చేశారు. ఏప్రిల్ 2025 నాటికి ఉమ్మడి జిల్లాలో 10,17,023 కార్డులు ఉండగా, మేలో లబ్ధిదారులకు బియ్యం అందించారు.

మే 25 నాటికి 10,29,230 రేషన్ కార్డులకు చేరగా, జూన్​లో వారందరికీ మూడు నెలల కోటా బియ్యం అందించారు. ఆ తర్వాత మే 25 నుంచి ఆగస్టు 9 వరకు కొత్తగా 96,060 కార్డులు మంజూరు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 11,25,290కు చేరింది. ఈ రేషన్​ కార్డుల్లో మొత్తంగా 34,05,671 మంది మెంబర్లుగా ఉన్నారు. వీరందరికీ 20,434 టన్నుల బియ్యం అందించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..