Navodaya 6th Admissions 2026: నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేశారా..? మరో 2 రోజులే ఛాన్స్!
నవోదయ విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులకు మరో రెండు రోజులో ఛాన్స్. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు తుది గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జులై 29, 2025వ తేదీతోనే..

హైదరాబాద్, ఆగస్ట్ 11: జవహర్ నవోదయ విద్యాలయ (JNV) విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులకు మరో రెండు రోజులో ఛాన్స్. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు తుది గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు జులై 29, 2025వ తేదీతోనే తుది గడువు ముగిసింది. అయితే ఇటీవల దరఖాస్తు స్వీకరణ గడువును పొడిగిస్తూ JNV ప్రకటన జారీ చేసింది. తాజా నిర్ణయంతో దరఖాస్తు దారులకు మరికొంత సమయం లభించినట్లైంది. అందువల్ల అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 13వ తేదీ రాత్రి 11.59 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
కాగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 654 జేఎన్‌వీల్లో ఆరో తరగతిలో సీట్ల భర్తీకి రెండు విడతల్లో ప్రవేశ పరీక్ష 2026 నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ 13, 2025 న తొలి విడత ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇక జమ్మూ కశ్మీర్ సహా పలు పర్వత ప్రాంత రాష్ట్రాల్లో ఏప్రిల్ 11, 2026న మలిదశ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా ఆగస్టు 13వ తేదీలోపు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులకు వీటిల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్యతోపాటు బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2026 ద్వారా ఆయా రాష్ట్రాల్లోని నవోదయ విద్యా సంస్థల్లో సీట్లు కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




