AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10th Class Public Exams 2026: విద్యాశాఖ యూటర్న్‌.. పాత పద్ధతిలోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు!

ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా యూటర్న్‌ తీసుకుంది. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ తాజాగా..

10th Class Public Exams 2026: విద్యాశాఖ యూటర్న్‌.. పాత పద్ధతిలోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు!
10th Class Public Exams
Srilakshmi C
|

Updated on: Aug 11, 2025 | 11:21 PM

Share

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 11: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా యూటర్న్‌ తీసుకుంది. ఈ ఏడాదికి పాత పద్ధతిలోనే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ తాజాగా వెల్లడించింది. అయితే పదో తరగతి పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్‌ మార్కుల విధానం కొనసాగించాలని, 80 శాతం ఎక్స్‌టర్నల్‌ మార్కులకు కేటాయించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

నిజానికి, పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులు ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌లో ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం వంద మార్కులకు పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై సర్కార్‌ వెనక్కి తగ్గింది. పాత పద్ధతిలోనే టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. దీంతో 20 శాతం ఇంటర్నల్‌ మార్కుల విధానం యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఏడాదికి అసలు ఇంటర్నల్‌ మార్కులు ఉంటాయా? లేదా? అనే అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ సర్కార్‌ ఈ మేరకు ప్రకటన జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు క్లారిటీ లభించింది. ఇటీవల ఢిల్లీలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఈ నిర్ణయంపై ప్రశ్నలు తలెత్తడంతో పునరాలోచనలో పడిన పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం