AP DSC Results: ఏపీ మెగా డీఎస్సీ ఫలితాల విడుదల.. ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షా తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని పాఠశాలల్లో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా. జూన్ 6 నుంచి జులై 2 వరకు 23 మధ్య జరిగిన ఈ పరీక్షకు సుమారు 92.90 శాతం మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. అయితే ఇటీవల అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సవరించిన తుది ‘కీ’ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియతో రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విషయాన్ని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in ద్వారా తెలుసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
ఫలితాలతో పాటు స్కోర్‌కార్డులు కూడా వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌తో వెబ్‌సైల్‌లోకి వెళ్లి తమ తుది ఫలితాలతో పాటు స్కోర్ కార్డును చూసుకొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
ఫలితాలు తెలుసుకోండి ఇలా..
- అభ్యర్థులు ముందుగా https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత హోంపేజీలో కనిపించే మెగా డీఎస్సీ-2025 ఫలితాలపై క్లిక్ చేయండి.
- తర్వాత క్యాండిడేట్ లాగిన్‌కు సంబంధించిన పాప్‌అప్ ఓపెన్ అవుతుంది
- అందులో యూజర్ నేమ్ పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- అక్కడ మీకు మీ స్కోర్ కార్డు కనిపిస్తుంది. దాన్ని పరిశీలించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
- అందులో మీరు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ అనే వివరాలు ఉంటాయి
మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
