AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికాసేపట్లోనే పెళ్లి.. ఇంతలో మొదటి భార్యతో పెళ్లికొడుకు జంప్‌! ఆ తర్వాత..

గతంలో అప్పటికే పెళ్లైన విషయం దాచి.. మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడో ప్రబుద్ధుడు. చివరికి పెళ్లి పీటలపై కూర్చుని మరి కాసేపట్లో ముహుర్తం ఉందనగా.. ఉన్నట్లుండి పెళ్లి కొడుకు మాయమయ్యాడు. దీంతో పెళ్లింట కలకలం రేగింది. కాసేపటికే మరో షాకింగ్‌ న్యూస్‌ పెళ్లివారికి అదిందింది..

మరికాసేపట్లోనే పెళ్లి.. ఇంతలో మొదటి భార్యతో పెళ్లికొడుకు జంప్‌! ఆ తర్వాత..
Groom Elopes With First Wife
Srilakshmi C
|

Updated on: Aug 12, 2025 | 6:23 AM

Share

దేవరపల్లి, ఆగస్ట్‌ 10: ఓ ప్రబుద్ధుడు చేసిన పనికి ఊరుఊరంతా నోరెళ్ల బెట్టింది. గతంలో అప్పటికే పెళ్లైన విషయం దాచి.. మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. చివరికి పెళ్లి పీటలపై కూర్చుని మరి కాసేపట్లో ముహుర్తం ఉందనగా.. ఉన్నట్లుండి పెళ్లి కొడుకు మాయమయ్యాడు. దీంతో పెళ్లింట కలకలం రేగింది. కాసేపటికే మరో షాకింగ్‌ న్యూస్‌ పెళ్లివారికి అదిందింది. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరారయ్యాడనే వార్త విని అంతా షాకయ్యారు. దీంతో ఆగ్రహానికి గురైన వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర ఘటన తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం (ఆగస్టు 11) చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలుకి చెందిన పాలి సత్యనారాయణకు గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. వీరికి సోమవారం (ఆగస్ట్‌ 11) తెల్లవారుజామున వివాహం జరిపేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. పెళ్లి పనులు కూడా పూర్తయ్యాయి. మరికాసేపట్లోనే పెళ్లి తంతు ప్రారంభంకానుంది. కానీ ఇంతలో ఆదివారం రాత్రి హఠాత్తుగా పెళ్లి కొడుకు కనిపించడం లేదనే వార్త పెళ్లింట దావానంలా పాకింది.

ఈ విషయం వధువు తరఫు బంధువులకు చేరడంతో వారికి అనుమానం వచ్చి దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భర్త చనిపోయిన ఓ మహిళతో సత్యనారాయణకు ఐదేళ్ల కిందటే వివాహమైనట్లు పోలీసులకు తెలిపారు. ఆమె కుమార్తెకు కూడా సత్యనారాయణే వివాహం జరిపించాడని తెలిపారు. ఆదివారం సదరు మహిళ ఫోన్‌ చేసి కేసు పెడతానని బెదిరించడంతో ఆమెతో కలిసి వరుడు పరారయ్యాడని వధువు తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి కుమార్తెకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు కేసు వివరాలను సీఐ బి.నాగేశ్వర నాయక్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా