Lifespan: ఆయుష్షు వేగంగా తగ్గించి మరణానికి చేరువ చేసే దుర్గుణాలు ఇవే.. మీలోనూ ఉన్నాయా?
ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ ఎవరిలోనైతే చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయో వారి ఆయుష్షు వేగంగా తగ్గి మరణానికి దగ్గరగా తీసుకువస్తాయని చెబుతున్నాడు విదురుడు. ముఖ్యంగా కోపం, స్వార్థం, ఎదుటి వారిపై విషం చిమ్మడం, వినాశనాన్ని కోరుకోవడం వంటి దుర్గుణాలు మీ ఆయుష్షును వేగంగా తగ్గించేస్తాయట..

పుట్టిన వారికి ఎప్పుడో అప్పుడు మరణం ఖాయం అన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు. ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. కానీ ఎవరిలోనైతే చెడు లక్షణాలు ఎక్కువగా ఉంటాయో వారి ఆయుష్షు వేగంగా తగ్గి మరణానికి దగ్గరగా తీసుకువస్తాయని చెబుతున్నాడు విదురుడు. చెడుగా ప్రవర్తించే ఏ వ్యక్తి జీవితకాలం అయినా ఖచ్చితంగా తగ్గిపోతుందని పేర్కొన్నాడు. కాబట్టి దీర్ఘాయుష్షు సాధించడానికి ఈ లక్షణాలను వెంటనే వదిలివేయాలట. ఆయుష్షు తగ్గించే ఆ చెడు అలవాట్లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
మితిమీరిన కోపం
కోపం అందరికీ వస్తుంది. కానీ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలో తెలుసుకోవాలి. కోపం చేతికి జ్ఞానం ఇవ్వడం ద్వారా తప్పులు చేసే అవకాశం ఎక్కువవుతాయి. మీరు కోపంగా ఉన్నప్పుడు సరైనది తప్పు అని చెప్పలేరు. దీని వల్ల చెడు పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అతిగా కోపం తెచ్చుకునే వారు తమ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. వారి ఆయుష్షు కూడా వేగంగా తగ్గిపోతుంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని, ఓపికగా ఉండటం నేర్చుకోవాలని విదురుడు అంటున్నాడు.
అహంకారం
ఇతరుల కంటే తాను ఉన్నతుడనే భావన కూడా ఒక వ్యక్తి వినాశనానికి దారితీస్తుంది. అహంకారి తానే సరైనవాడినని భావించే వ్యక్తి పెద్దల సలహా వినడు. వారు తమకన్నా పెద్దవారిని ఎల్లప్పుడూ అవమానిస్తుంటారు. ఒక వ్యక్తి అహంకారి అయి, తాను గొప్పవాడినని భావిస్తే అతని ఆయుష్షు తగ్గిపోతుందని విదురుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు.
స్వార్థం
ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా స్వార్థపరుడే. కానీ స్వార్థపూరిత వైఖరి ఇతరుల వినాశనం కోరుకుంటుంది. అందువల్ల విదురుడు చెప్పినట్లుగా, స్వార్థపరుడు మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించలేడు. తన చుట్టూ ఉన్న వ్యక్తులను తనకు నచ్చిన విధంగా తనకోసం ఉపయోగించుకుంటాడు. ఈ గుణం వారి జీవితకాలాన్ని తగ్గిస్తుంది.
మాటలు అదుపులో ఉంచుకోవాలి
కొంతమంది తమ మాటలతోనే కోటలు కడతారు. మీ చుట్టూ అలాంటి వ్యక్తులను అనేక మందిని గమనించి ఉండవచ్చు. ఎక్కువగా మాట్లాడే వాళ్ళు అబద్ధాలు చెబుతారు. వారు ఎదుటి వ్యక్తి మనోభావాలను కేవలం తమ మాటలతోనే తీవ్రంగా గాయపరుస్తారు. కాబట్టి, ఎల్లప్పుడు పరిమితంగా మాత్రమే మాట్లాడాలి. అవసరమైనంత మాత్రమేనే మాట్లాడాలి. లేదంటే మునిగా మౌనంగా ఉండటం మంచిది. అతిగా మాట్లాడినా ఆయుర్దాయం తగ్గుతుందని విదురుడు అంటాడు.
త్యాగ భావన కలిగి ఉండాలి
నేటి కాలంలో త్యాగ గుణం ఉన్న వ్యక్తులను చూడటం చాలా అరుదు. కానీ తన గురించి ఆలోచించే బదులు, ఇతరుల గురించి ఆలోచించగలగాలి. తాను కోరుకున్నది కలిగి ఉండటంతో సంతృప్తి చెందాలి. వీలైతే సహాయం చేసే గుణం కలిగి ఉండాలి. త్యాగం, అంకితభావం లేని వ్యక్తి జీవితకాలం తగ్గిపోతుంది. వారు మరణానికి చేరువవుతారు.
గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.