Valentines Day 2024: వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలా.. మీ ప్రేమను పంచే ఈ మొక్కలు బెస్ట్!
వాలంటైన్స్‌డే వచ్చేస్తుంది.. ప్రేమించిన వారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాల అని లవర్స్ తెగ హైరానా పడుతూ ఉంటారు. కొంత మంది ఖరీదైన గిఫ్టులు ఇస్తారు. మరి కొంత మంది సింపుల్‌గా ఉండేవి ఇవ్వాలి అనుకుంటారు. ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వారికి నచ్చినవి ఇస్తూ ఉంటారు. కానీ స్పెషల్‌గా ఉండాలంటే ఇండోర్ ప్లాంట్స్‌ని బహుమతిగా ఇవ్వండి. ఇండోర్ ప్లాంట్లు డెకరేటీవ్‌గా మాత్రమే కాకుండా.. ప్రేమను, సంబంధాల్లో దీర్ఘాయువును సూచిస్తాయి. మీ ప్రేమను తెలిపే విధంగా ఎలాంటి ఇండోర్..

వాలెంటైన్స్ డే వచ్చేస్తుంది.. ప్రేమించిన వారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాల అని లవర్స్ తెగ హైరానా పడుతూ ఉంటారు. కొంత మంది ఖరీదైన గిఫ్టులు ఇస్తారు. మరి కొంత మంది సింపుల్‌గా ఉండేవి ఇవ్వాలి అనుకుంటారు. ఇలా ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వారికి నచ్చినవి ఇస్తూ ఉంటారు. కానీ స్పెషల్‌గా ఉండాలంటే ఇండోర్ ప్లాంట్స్‌ని బహుమతిగా ఇవ్వండి. ఇండోర్ ప్లాంట్లు డెకరేటీవ్‌గా మాత్రమే కాకుండా.. ప్రేమను, సంబంధాల్లో దీర్ఘాయువును సూచిస్తాయి. మీ ప్రేమను తెలిపే విధంగా ఎలాంటి ఇండోర్ ప్లాంట్స్ ఇస్తే మీ ప్రేమ పెరుగుతుందో ఇప్పుడు చూసేండి.
రెడ్ ఆంథూరియం:
రెడ్ ఆంథూరియం ప్లాంట్ ఆకులు అనేవి అచ్చం హార్ట్ షేప్‌లా ఉంటాయి. చూడటానికి కూడా ఇది ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇది మీరు ఇస్తున్న వ్యక్తికి అభిరుచి, ప్రేమ, ఆనందాన్ని సూచిస్తుంది. ఈ ప్లాండ్ చాలా రంగుల్లో వివిధ షేపుల్లో కూడా లభిస్తుంది. కానీ వాలెంటైన్స్‌కి మాత్రం ఇది ప్రత్యేకం అనే చెప్పాలి. అదే విధంగా ఇంటికి కూడా మంచి అందాన్ని ఇస్తుంది.
హార్ట్ ఫెర్స్న్:
వాలెంటైన్స్ డే రోజు ఇచ్చే బహుమతిగా ఇచ్చే ఇండోర్ ప్లాంట్స్‌లో హార్ట్ ఫెర్స్న్ కూడా ఒకటి. ఈ ప్లాంట్ ఆకులు కూడా గుండె ఆకారంలోనే ఉంటుంది. గుండె ఆకారపు ఆకులతో ఈ మొక్క ప్రేమకు పరిపూర్ణ ప్రాతినిధ్యం. అంతే కాకుండా అందంగా కనిపిస్తుంది.
ఆర్కిడ్లు:
ఆర్కిడ్లు కూడా ఇండోర్ ప్లాంట్‌లలో ఒకటి. ఇది ఎంతో ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది. ఈ ప్లాంట్ పువ్వులు హార్ట్ షేపులో అందంగా కనిపిస్తాయి. ఈ పువ్వుల నుంచి మంచి సువాసన కూడా వస్తుంది. వాలెంటైన్స్ డే రోజు ఈ ప్లాంట్ కూడా బహుమతిగా ఇవ్వొచ్చు. ఇదులోనే అనేక కలర్స్ ఉన్నాయి. పర్పుల్, పింక్, వైట్ ఇలా చాలా ఉంటాయి.
సైక్లామెన్:
సైక్లామెన్ కూడా ఇండోర్ ప్లాంట్స్‌లో ఒకటి. ఈ ప్లాంట్ కూడా అందంగా, ఆకర్షణీయంగా అనిపిస్తుంది. ఈ ప్లాంట్ ఆకులు అచ్చం హార్ట్ షేపులో ఉంటాయి. దీన్ని మీరు ప్రేమించే వారికి గిఫ్ట్‌గా ఇస్తే చాలా నచ్చుతుంది. ఇంటికి అందం కూడా తీసుకువస్తుంది. ఈ మొక్కలో కూడా మంచి కలర్స్ ఉంటాయి.








