Blood Increase Foods: ఒంట్లో రక్తం అమాంతం పెరగాలా.. ఈ ఫుడ్స్ బెస్ట్!
శరీరంలో తగిన మోతాదులో రక్తం ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నారు. బద్ధకం, ఏ పనీ చేయకపోయినా అలసిపోవడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, నీరసంగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒక్కోసారి కొంత మంది కళ్లు తిరిగి పడిపోతూ ఉంటారు. రక్తం తక్కువగా ఉండటాన్ని..

శరీరంలో తగిన మోతాదులో రక్తం ఉండాలి. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాడాల్సి వస్తుంది. ప్రస్తుతం చాలా మంది రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నారు. బద్ధకం, ఏ పనీ చేయకపోయినా అలసిపోవడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, నీరసంగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒక్కోసారి కొంత మంది కళ్లు తిరిగి పడిపోతూ ఉంటారు. రక్తం తక్కువగా ఉండటాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. రక్తం అనేది శరీరంలోని ప్రతీ భాగానికి అవసరం. రక్తం సమృద్ధిగా ఉంటేనే.. శరీరానికి హాని చేసే వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడగలదు. ఈ సమస్యను అస్సలు లైట్‌గా తీసుకోకూడదు. కొన్ని రకాల ఆహారాలు తింటే సహజంగానే ఒంట్లో రక్తాన్ని పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
దానిమ్మ పండ్లు:
దానిమ్మ పండ్లు తినడం వల్ల రక్తం పడుతుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ, ఫైబర్, ఐరన్, కార్బోహైడ్రేట్లు అనేవి పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు దానిమ్మ పండు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఖర్జూరం:
ఖర్జూరాల్లో కూడా ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తం లోపాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. రక్త హీనత సమస్య ఉన్నవారు ప్రతి రోజూ ఓ రెండు ఖర్జూరాలు తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారు కూడా డేట్స్ ని హ్యాపీగా తినొచ్చు.
అరటి పండ్లు:
అరటి పండ్లు తినడం వల్ల బ్లడ్ కౌంట్ అనేది పెరుగుతుంది. అరటి పండులో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు బాగా పని చేయడానికి బనానా హెల్ప్ చేస్తుంది. అంతే ఎన్నో ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. చిన్న పిల్లలకు ప్రతి రోజూ ఒక అరటి పండు ఇస్తే ఎంతో మంచిది. అరటి పండు శరీరంలో ఫోలిక్ ఆమ్లాన్ని తయారు చేయడానికి హెల్ప్ చేస్తుంది.
బీట్ రూట్:
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి బీట్ రూట్ చక్కగా పని చేస్తుంది. ఇందులో ఐరన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్‌ని సలాడ్ రూపంలో తింటే చాలా మంచిది. ఇంకా ఆకు కూరలు, ఉసిరి తిన్నా కూడా బ్లడ్ పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.








