Valentine’s Day Songs: ప్రేమ ఎంత మధురం.. వాలెంటైన్స్ డే రోజున ఠక్కున గుర్తొచ్చే సాంగ్స్ ఇవే..

Valentine's Day Songs: ప్రేమ ఎంత మధురం.. వాలెంటైన్స్ డే రోజున ఠక్కున గుర్తొచ్చే సాంగ్స్ ఇవే..
Telugu Love

ప్రేమ అంతంలేని మధుర జ్ఞాపకం.. ప్రేమలో పడనివారంటూ ఉండరు. ఎంతటి గొప్ప వ్యక్తి... నాయకుడైన ఎప్పుడోసారి ప్రేమలో పడినవారే.

Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Feb 14, 2022 | 5:14 PM

ప్రేమ అంతంలేని మధుర జ్ఞాపకం.. ప్రేమలో పడనివారంటూ ఉండరు. ఎంతటి గొప్ప వ్యక్తి… నాయకుడైన ఎప్పుడోసారి ప్రేమలో పడినవారే. ప్రతిఒక్కరి జీవితంలో ప్రేమ అనేది కచ్చితంగా ఉంటుంది. అది అబ్బాయి, అమ్మాయి మధ్య పుట్టే ఆకర్షణ మాత్రమే కాదు.. పిల్లలపై తల్లిదండ్రులకు.. అన్నాచెల్లెల్లకు.. అన్నదమ్ముళ్లకు.. ప్రాణస్నేహితులకు ఇలా ఒకరిపై ఒకరు వర్ణించలేని అమితమైన ఇష్టమే ప్రేమ. ఇది వర్ణించడానికి చాలవు మాటలు.. ఎదలో తమకు ఇష్టమైన వారి కోసం ఎన్నో ఆలోచనలు.. అర్థం కానీ భావనలు అనేకం. ఇక ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడం.. ఆ భావనను వ్యక్తం చేయడానికి అమ్మాయికి అబ్బాయికి మాటలు చాలవు.. తమ మనసులో దాచుకున్ సముద్రమంత ప్రేమను తెలియజేయడానికి పడే తంటాల గురించి తెలిసిందే. అమ్మాయిలు.. ఆరడుగులు ఉంటాడా.. ఏడడుగులేస్తాడా.. ఏం అడిగినా ఇచ్చేవాడా… అంటూ.. మన్మథుడా నీ కల కన్నా… అంటూ పాటలు పాడేసుకుంటారు.

ఇక అబ్బాయిలు.. ఉంగరాల జుట్టు వాడ్ని ఒడ్డు పొడుగు ఉన్నవాడ్ని చేరి నిన్ను కోరుకుంటే చౌకబేరమా.. వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన! నా ప్రాణమిచ్చుకోన.. నీ రూపు చూసి శిలను అయితినే.. ఓ మాట రాక మూగబోతినే అంటూ తమ ప్రేయసి గురించి ఫీల్ అవుతుంటారు. అలా ప్రేమ అనగానే.. మన మనసులోకి.. మన పెదవి పైకి వచ్చే పాటలు కొన్ని ఉన్నాయి. అవెంటో తెలుసుకోందామా.

కన్నుల్లో నీ రూపమే.. గుండెల్లో నీ ధ్యానమే.. అంటూ నిన్నే పెళ్లాడతా సినిమాలోని ఈ పాట ఇప్పటికీ యూత్‏లో క్రేజ్ ఎక్కువే.

అలాగే తెలుసునా తెలుసునా మనసుకీ తొలి కదలిక అంటూ సాగే ఈ పాట సొంతం సినిమాలోనిది. ప్రేమలో ఉన్న అమ్మాయిలు ఇప్పటికీ ఈ పాటను పాడుకుంటూనే ఉంటారు.

మన్మధుడా నీ కల కన్నా.. మన్మధుడా నీ కథ విన్న మన్మధుడంటే ప్రాణంలే మన్మధుడే నాక్కావలలే పాటకు ఇప్పటికీ యమా క్రేజ్..

వాలు కనులదానా నీ విలువ చెప్పు మైన! నా ప్రాణమిచ్చుకోన.. నీ రూపు చూసి శిలను అయితినే.. ఓ మాట రాక మూగబోతినే .. ప్రేమికుల రోజు చిత్రంలోని ఈ పాటకు ఇప్పటికీ టాప్.

అలాగే అల వైకుంఠపురంలోని బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే సాంగ్.. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా.. మబ్బులు నిన్ను కమ్మేస్తాయని మౌనంగా ఉన్నా.. – 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? సినిమాలోని గుర్తొస్తాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. కొన్ని వేల కొద్ది పాటలు మనకు ఠక్కున గుర్తొస్తాయి. మరీ మీకు ఏ పాట గుర్తుస్తుంది.

Also Read: Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తల్లి, సోదరితోపాటు శిల్పాశెట్టికి కోర్టు నోటిసులు..

Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.

Valentine’s Day 2022: ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం.. మాటలకందని భావాలను మనసులోని వారికి తెలియజేయండిలా..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu