uppula Raju |
Updated on: Feb 14, 2022 | 9:44 AM
నేడు ప్రేమికుల రోజు. కోట్లాది మంది తమ సహచరులు, స్నేహితులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతారు. మీరు కూడా మీ ప్రియమైన వారికి స్పెషల్‌గా శుభాకాంక్షలు చెప్పండి.
స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ సాయంతో fotor.comని సందర్శించండి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రక్రియను అనుసరించండి. ఇష్టమైన టెక్స్ట్, ఫోటో, శైలిని డౌన్‌లోడ్ చేసుకుని షేర్ చేసుకోవచ్చు.
Google Playstoreలో వాల్‌పేపర్లకి సంబంధించి అనేక యాప్‌లు ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకొని ఇష్టమైన ఫోటో, టెక్స్ట్ ద్వారా వాల్‌పేపర్‌ను సిద్ధం చేసి షేర్ చేయవచ్చు.
మీరు స్మార్ట్‌ఫోన్‌లో సొంత స్టిక్కర్‌ని తయారుచేయవచ్చు. దీని కోసం మీరు Google Play స్టోర్‌లో ఉన్న ఏదైనా స్టిక్కర్ యాప్‌ని ఉపయోగించవచ్చు.
మీరు వాలెంటైన్ సందేశం కోసం GIFని కూడా ఉపయోగించవచ్చు. కొన్ని సెకన్ల వీడియోని షేర్ చేయవచ్చు. ఇందుకోసం Google Play Store నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా యాప్‌ను డౌన్‌లోడ్ చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోండి.